best vegetable juice for health

అన్నింటికంటే శక్తివంతమైన జ్యూస్

హలో ఫ్రెండ్స్ యోగ సంప్రదాయంలో మనం తినే ఆహారాన్ని మూడు విధాలుగా విభజిస్తాం. పాజిటివ్ ప్రాణిక్  ఆహారం, నెగిటివ్ ప్రాణిక్  ఆహారం మరియు జీరో ప్రాణిక్ ఆహారం. పాజిటివ్ ప్రాణిక్ అంటే దాన్ని తీసుకున్నప్పుడు మన వ్యవస్థ కు కొంత ప్రాణ శక్తిని అందిస్తుంది నెగిటివ్ ప్రాణిక్ ఆహారం అంటే అది మన వ్యవస్థలోని శక్తిని తగ్గిస్తుంది. జీరో ప్రాణిక్ అనేది పెంచదు తగ్గించదు దీన్ని కేవలం రుచికోసం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి పాజిటివ్ ప్రాణికి ఆహారం తీసుకుంటే మన శక్తి క్రియాశీలకంగా ప్రకన్పిస్తుంది.

ముఖ్యంగా ప్రాణశక్తికి చాలా చాలా మేలు చేసే ఒక ఆహారం బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ చాలా ప్రాణహిత మైన ఆహారం. ఈ రోజుల్లో దాన్ని గుమ్మం ముందు వేలాడ తీస్తారు లేదా మూడు కూడల రోడ్డు మీద పగలగొట్టి గేదెలకు వేయడము చేస్తున్నాము. కానీ మనం మాత్రం దానిని తినడం లేదు. మనం దీన్ని తప్పకుండా తినాలి ఎందుకంటే బూడిదగుమ్మడి కాయలలో చాలా చాలా ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది అందుకే దీనిని ఇంటి గుమ్మానికి కడతారు ఎందుకంటే దాని నుండి చక్కటి శక్తి ఆవరిస్తుంది కాబట్టి. దీనికి  అంతటి ప్రాణశక్తి ఉన్నప్పుడు మన లోపలికి తీసుకోవడం మంచిదే కదా. మనం కనుక దీనిని తింటే చాలా మంచిది. దీని మీద ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి.

ప్రతిరోజూ ఒక గ్లాసెడు బూడిద గుమ్మడికాయ రసం తీసుకున్నట్లయితే మన శరీరంలోని క్యాన్సర్ కణాల సంఖ్య గణనీయంగా తగ్గుతాయి. మన బుద్ధి మరింత నిశితంగా మారడాన్ని స్పష్టంగా చూడగలుగుతాము. ప్రత్యేకించి పిల్లలు బూడిద గుమ్మడి రసం తప్పకుండా తాగాలి. ఈ రోజు బూడిద గుమ్మడి రసం తీసుకున్నప్పుడు మన బుద్ధి మరింత స్పష్టంగా చురుకుగా అవ్వడం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ జ్యూస్ తీసుకోవడం మొదలు పెట్టిన కొన్ని వారాలకే ఈ మార్పులను గమనించవచ్చు.

మీరు పొద్దున్నే ఒక కప్పు కాఫీ తాగితే అది మీకు శక్తిని ఇవ్వడంతోపాటు కొద్దిగా ఆందోళనలు కూడా కలిగిస్తుంది. అదే బూడిదగుమ్మడి రసం తాగితే గొప్ప శక్తిని ఇవ్వడంతోపాటు మిమ్మల్ని స్థిమిత పరుస్తుంది. వీలైనంత తరచుగా దీనిని తీసుకోవడం మంచిది. కానీ ఆస్తమా ఉన్నవారు తరచుగా జలుబు దగ్గుతో బాధపడేవారు బూడిదగుమ్మడి రసం తాగినప్పుడు వెంటనే జలుబు చేసే అవకాశం ఉంది ఎందుకంటే అది మన శరీరంలో చలువ చేసే అవకాశం ఉంది. ఇలాంటి  సమస్య ఉన్నవారు బూడిదగుమ్మడి రసానికి కొంత తేనె గాని మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. అలా చేయడం వల్ల బూడిద గుమ్మడి రసం వల్ల కలిగే చలువ కొంత వరకు తగ్గిస్తుంది.

మనుగడ సాగించడం కోసం మాత్రమే తినేటప్పుడు మనకు ఏది దొరికితే అది తినేసే వాళ్ళం. కానీ ఇప్పుడు మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి శరీరానికి ఏది మేలు చేస్తుందో దాన్ని ఎంచుకోవాలి. మనం ఎలా ఎంపిక చేసుకో లేకపోతే మనం ఏదోలా బ్రతికి వెళ్లిపోతాం. ఇవన్నీ ఎవరికి ముఖ్యం అంటే కేవలం ఎవరైతే నిరంతరం తమ జీవితాన్ని మెరుగుపరచుకోవడం ఎలా? ఇంకొంచెం మెరుగ్గా రాణించడంతో ఎలా? జీవం యొక్క మరొక ప్రస్వాన్ని అనుభవించడం ఎలా అంటూ కృషి చేస్తూ ఉంటారో వారి విషయంలో ఈ అంతరానికి ఎటువంటి ఆహారాన్ని లేదా ఇంధనాన్ని అందిస్తున్నది  చాలా ముఖ్యమైన విషయం.

Ashgourd Juice – Ashgourd, pepper, Lemon and salt

బూడిద గుమ్మడి కాయ రసం తయారు చేసే విధానం

ముందుగా బూడిదగుమ్మడి కాయ 100 గ్రాములు తీసుకుని అందులో గింజలను తొలగించి పై చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేయాలి. తర్వాత రసాన్ని వడగట్టాలి. తర్వాత ఈ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టి తాగండి

Leave a Comment

error: Content is protected !!