దద్దుర్లు, దురదలు, స్కిన్ ఎలర్జీస్ వంటివి ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే కొంతమందికి డస్ట్ వలన, ఫుడ్ వలన, పర్యావరణంలో వచ్చే మార్పుల వలన, దుస్తుల వలన, కొన్ని రకాల స్ప్రేస్ కెమికల్స్ వలన వీటిలో దేని వలన ఆర్టీకేరియా వస్తుందో మనకు తెలియదు. ఇది ఒకసారి వచ్చి తగ్గి మరలా రాకపోతే దానిని ఆర్టికేరియా అనరు. అదే ఒక 5,6 వారాలు గనక కంటిన్యూగా వస్తూ ఉంటే దాన్ని శాశ్వతంగా ఆర్టికేరియా ఎలర్జీ కింద భావించవచ్చు. దీనికి తాత్కాలికంగా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు కానీ వాటి ప్రభావం ఎక్కువసేపు ఉండదు.
ఇలాంటివి రోజు వాడిన అనుగుతుంది తప్ప శాశ్వతంగా పోవడం లేదు. వీటికి నాచురోపతిలో శాశ్వత పరిష్కారం ఉంది. నాచురోపతిలో దీనికి ముందుగా రోజు నాలుగు లీటర్ల నీటిని తాగుతూ ఉండాలి. ఎలర్జీలు తగ్గాలి అంటే వాటర్ యాంటీహీస్టామీన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి బాడీని డీటాక్స్ చేసుకోవాలి అన్న, స్కిన్ లో వచ్చే ఎలర్జీ తగ్గించుకోవాలి అన్న, హీస్టామీన్స్ న్యూట్రల్ చేసుకోవాలి అన్న ఏంటి హీస్టామీన్ వాటర్ 4-5 లీటర్స్ తాగాలి. రెండవదిగా దద్దుర్లు అవి తగ్గడానికి హనీ, లెమన్ వాటర్ ఫాస్టింగ్ చేయాలి. ఒకవేళ లెమన్, హనీ ఎలర్జీ ఉన్న ఫాస్టింగ్ చేయవచ్చు.
హనీ ఎలర్జీ ఉన్నప్పుడు గ్లూకోజ్ వాడవచ్చు, అలాగే బెల్లం కలుపుకొని పానకంల చేసుకొని తాగవచ్చు. లెమన్ ఎలర్జీ ఉంటే ఉత్తి హనీ వాటర్ తాగవచ్చు. ఇలా 5-6 రోజులు చేసేసరికి చర్మంపై ఉన్న దురదలు దద్దుర్లు తగ్గుతాయి. ఇలా చేసిన తర్వాత జ్యూస్ ఫాస్టింగ్ చేయాలి. ఇలా మూడు రోజులు చేసి తరువాత ఫ్రూట్ ఫాస్టింగ్ చేయాలి. ఇలా ఒక 15 రోజులు చేసేసరికి ఆర్టీకేరీయా తగ్గుతుంది. ఇలా లోపలికి చేస్తే బహిర్గతంగా రోజు స్టీమ్ బాత్ చేయాలి. రోజు నాలుగు నుంచి ఐదు లీటర్లు నీరు బయటికి పోయే వరకు స్టీమ్ బాత్ చేయాలి.
ఇలా స్నానం చేసే ముందు పెప్పర్మెంట్ ఆయిల్ గాని, యుకాలీప్టస్ ఆయిల్ గాని, కొబ్బరి నూనె గాని రాసుకోవడం ద్వారా దురద నుంచి విముక్తి పొందవచ్చు. స్నానం చేసిన తర్వాత కూడా పెప్పర్మెంట్ ఆయిల్ ఉపయోగించవచ్చు. దీని ద్వారా కూడా దురద నుంచి విముక్తి పొందవచ్చు…