best way to lose weight natually

ఇవి పాటిస్తే చాలు అధిక బరువు బలాదూర్

అందంగా నాజూగ్గా కనిపించాలని అందరికి ఉంటుంది. కానీ అధిక బరువు బాధిస్తోంటుంది. చుట్టుపక్కల వారు, స్నేహితులలో కూడా తప్పకుండా లావుగా ఉన్నవారిని జోకర్ లా చూస్తుంటారు. బయటకు చెప్పీ చెప్పని విషయాలు అయితే బోలెడు. అధిక బరువు వల్ల మనం ఇబ్బంది పడటమే కాకుండా అందరి మాటలకు కృంగిపోతుంటాం. కానీ బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే ఇష్టంగా ఇంకెంతో నిజాయితీగా కింద ఇవ్వబడిన సూచనలు పాటించాలి. తొలుస్తూ పోతే కొండలే కరిగిపోతున్నాయ్, మన ఆధీనంలో ఉన్న మన శరీర బరువు ఒక లెక్కనా

బరువును కరిగిద్దామిలా

మనకోసం మనం వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు.

◆బరువు పెరగడం అనేది ఎప్పుడైనా ఆహారం దగ్గరే మొదలవుతుంది అందుకే మనం రోజూ ఏం తింటున్నాం?? ఏ సమయానికి తింటున్నాం?? ఎంత మోతాదులో తింటున్నాం?? వంటి విషయాలు ఒక చిన్న పుస్తకంలో రాసుకోవాలి.

ఒక చిన్న పరిశీలన

◆ ప్రతిరోజు మనం ఆకలి వేసినపుడే ఆహారాన్ని తీసుకుంటున్నామా?? ఒక్కసారి మనల్ని మనం గమనించుకుంటే ఎక్కువ శాతం ఎమోషనల్ గా ఉన్నపుడో లేక కోపం గా ఉన్నపుడో ఎక్కువ ఆహారం తినేస్తుంటాం అనే విషయం అర్థమవుతుంది. అందుకే మనకు ఆకలివేసినపుడు ప్రశాంతంగా ఆహారాన్ని తీసుకోవాలి దానివల్ల మనం ఆకలితీరేవరకు తినగలం. 90% మందిలో లావు అవ్వడానికి కారణం  బావోద్వేగాలలో ఉన్నపుడు ఆహారం తీసుకోవడమే అనేది కాస్త విస్మయపరిచే విషయం.

ఉదయాన్నే ఎగ్గొట్టోద్దు

◆ మనరోజు వారి పనుల్లో మనకు శక్తిని ఇచ్చే మొదటిది ఉదయం చేసే అల్పాహారం. రాత్రి నిద్రించిన తరువాత ఉదయం వరకు ఎలాంటి పదార్థం తీసుకోకపోవడం వల్ల అల్పాహారం తో రోజును మొదలుపెడితే ఉత్సహంగా ఉండవచ్చు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అల్పాహారాన్ని ఎగ్గొట్టకండి.

స్వీట్స్ తో గేమ్స్ వద్దు

◆ శరీరం లో చేరే ఎక్కువ క్యాలరీలు అన్ని తీపి పదార్థాల నుండి ఎక్కువ వస్తుంటాయి. పంచదార, నెయ్యి, నూనె ఇంకా వివిధ రకాల పాల ఉత్పత్తులలో కొవ్వులు ఎక్కువ ఉంటాయి. స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనూహ్యంగా బరువు పెరిగిపోతారు.

పండ్లతో పసందుగా

◆ బరువు తగ్గాలని అనుకునేవారు కీరదోస, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లను తీసుకోవడం ఉత్తమం. వీటి వల్ల తక్కువ క్యాలరీలు పొందటమే కాకుండా ఆకలి తీరిన భావన కూడా కలుగుతుంది.

వ్యాయామమే గొప్ప ఔషధం

◆వ్యాయామం మన రోజువారీ కృత్యంలో భాగం అవ్వాలి. వ్యాయామమంటే మనమేదో బరువులు ఎత్తుతూ, జిమ్ లో లాగా అన్ని చేసేయ్యాలని లేదు రోజూ అరగంటసేపు రన్నింగ్ లేదా జాగింగ్ చేయడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికే కాదు మనసును ఉల్లాసంగా కూడా ఉంచుతుంది.

మన శరీర ఇంధనం

◆ ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమన్న విషయం మనకు తెలిసినదే. నీళ్లను ఒక క్రమపద్ధతిలో తీసుకోవడం వల్ల మన శరీరంలో టాక్సిన్ లను బయటకు సమర్థవంతంగా పంపేసేది నీరే.

పీచు పదార్థాలతో బరువుకు చెక్ పెడదాం

◆ జీర్ణవ్యవస్థ సరిగా ఉంటే మన శరీరంలో కొవ్వులు పేరుకోవడం తక్కువ. అందుకే పీచు పదార్థాలను ఆహారంలో  తీసుకోవాలి. కొవ్వులను కరిగించడంలో కూడా పీచు పదార్థాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే బేకరీ పదార్థాలను దూరం గా ఉంచడం బరువు తగ్గడంతో ముఖ్య సూత్రం.

రోజువారీ చిట్టా 

◆ ప్రతిరోజు తీసుకునే ఆహారపదార్థాలను ఒక బుక్ లో రాసుకోవడం వల్ల మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం ఏ రూపంలో ఎక్కువ క్యాలరీలు తీసుకుంటున్నాం అనేది తొందరగా గ్రహించి పొరపాటును సరిదిద్దుకోవచ్చు.

కష్టం వద్దు ఇష్టంగా

◆ఒకేసారి ఆహారాన్ని పెద్దమొత్తం లో తీసుకోకుండా చిన్నచిన్న భాగాలుగా విభజించుకోవడం వల్ల కొవ్వులు పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే మనం తినే ఏ ఆహారం అయినా ఇష్టం గా తినాలి దానివల్ల మన శరీరం లో కూడా మనం కోరుకున్న మార్పులు సులువుగా జరుగుతాయి. 

చివరగా

మనం తీసుకునే ఆహార పదార్థమే కాదు మన సంకల్పమే మనం బరువు తగ్గడానికి ముఖ్యమైన ఆయుధం అందుకే మనల్ని దృఢపరిచే వ్యాసాలు, సంఘటనలకు  సంబంధించిన వీడియోలు వంటివి ఫాలో అవుతూ మనల్ని మనం దృఢంగా మార్చుకోవాలి. ఇవన్నీ ఆచరిస్తే బరువు పెద్ద సమస్య కాదు. మన కమిట్మెంట్  ముందు బలాదూర్ అవ్వక తప్పదు.

Leave a Comment

error: Content is protected !!