best way to stop smoking cigarettes

సిగరెట్ మానేయడం ఎలా? సిగరెట్ మానేసిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! Smoke

సిగరెట్ తాగడం హానికరమని అందరికి తెలుసు కానీ ఒక్కసారి అలవాటయితే మానేయడం ఆ వ్యసనం బారినపడినవారికి చాలా కష్టంగా మారిపోతుంది. సిగరెట్ వ్యసనం వారితోపాటు వారి చుట్టూ ఉన్నవారికి కూడా ప్రమాదమే. ప్రమాదకరమైన ఊపిరితిత్తుల కాన్సర్ కి కారణమవుతుంది. కష్టమయినా మానేయతాగడంzs, ప్రయత్నిస్తుంటారు. వారికోసం సిగరెట్ తాగడం మానేసిన తర్వాత వారి శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

సిగరెట్ తాగడం మానేసిన నలభై ఎనిమిది గంటల తర్వాత శరీరంలో రక్తప్రసరణ మామూలు స్థాయికి వచ్చేస్తుంది. ఎందుకంటే సిగరెట్ లో ఉండే నికోటిన్ అనే కెమికల్ ఎపినెఫ్రిన్, నాన్ఎపినెఫ్రిన్ అనే న్యూరో మీటర్స్ని ఉత్పత్తి చేసి గుండె వ్యాకోచసంకోచాలను ఎక్కువ చేస్తుంది. దీనితోపాటు రక్తనాళాలు కుచించుకొని పోయేలా చేస్తుంది. దీనివలన మీకు సిగరెట్ తాగాలి అనిపించేలా చేస్తుంది. దీనితోపాటు కృంగుబాటు, మానసిక ఆందోళన, కోపం వస్తుంటాయి. దీనినే విత్డ్రాల్ సింటమ్స్ అంటారు. 48గంటలవరకూ మెదడు సిగరెట్ తాగడంవైపు ఆకర్షిస్తుంది. ఆ నలభై ఎనిమిది గంటల తర్వాత శరీరంనుండి సిగరెట్తో పాటు శరీరంలో చేరిన కార్బన్ మోనాక్సైడ్, టాక్సిన్లను బయటకు పంపించేస్తాయి. ఆరోగ్యాన్ని పునరిద్దరింపచేస్తాయి.

సిగరెట్ మానేయడానికి కొన్ని టిప్స్

డేట్ ఫిక్స్ చేసుకోండి :- మానేయాలి అనిపించిన వెంటనే ఒకరోజు నిర్ణయించుకొని మానేయండి. ఆలస్యం చేస్తే ఆ ఉత్సాహం తగ్గిపోవచ్చు.

సహాయం తీసుకోండి :- తాగడం మానేయాలి అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్కి, చుట్టూ ఉన్నవారికి చెప్పండి. అప్పుడు వారు తాగమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. కొంతమంది నిరుత్సాహపరిచినా ప్రోత్సహించేవారి సహాయంతో త్వరగా మానేయగలుగుతారు.

ఛాలెంజింగ్గా తీసుకోండి:– సిగరెట్ మానేసిన రెండు రోజుల్లోపల రోజుకు ఆరుసార్లు తాగాలనిపిస్తుంది. మూడేసి నిమిషాలు చొప్పున పద్దెనిమిది నిమిషాలు అలా అనిపిస్తుంది. ఈ పద్దెనిమిది నిమిషాలు ఛాలెంజింగ్గా తీసుకుని వేరేవాటిపై మనసును మళ్ళించడానికి ప్రయత్నించండి.

చుట్టూ ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండేలా  కల్పించుకోండి :- మీ ఇంట్లో నుండి, మీ గదిలోనుండి మరియు కారులోనుండి లైటర్స్, యాష్ ట్రేలను తీసేసి బయటపడేయండి. పాత సిగరెట్ పాకెట్లను చించి పారేయండి. అప్పుడు మీరు సిగరెట్ మానేయడం గురించి సీరియస్ నిర్ణయం తీసుకున్నారని మెదడు గ్రహిస్తుంది.

ఖాళీ చేతులతో ఉండడం :- అలవాటయిపోవడం వలన చేతులు అలవాటుప్రకాలం అస్తమాను నోటి దగ్గరకు వెళుతుంటాయి. అలాంటప్పుడు ఆ అలవాటు మానేయాలని చూస్తే మెదడు ఇబ్బంది పడుతుంది. కనుక ఖాళీచేతులతో సిగరెట్ తాగుతున్నట్టు నటించడంవలన మెదడును భ్రమింపచేయొచ్చు. సిగరెట్ తాగాలి అనిపించినపుడు అల్లంఛాట్ లేదా ఉసిరికాండిలు అని దొరికుతాయి. వాటిని తినడం ద్వారా లేదా దాల్చినచెక్క నమలడం ద్వారా మనసును మళ్ళించొచ్చు. అంతే కాకుండా నీళ్ళు కూడా తాగడంవలన శరీరం డీటాక్సిఫికేషన్ అవుతుంది.

క్లిష్టసమయం:- కొన్ని సార్లు మనసు మన మాట విననని మారాంచేస్తుంది. అలాంటప్పుడు మీరు సిగరెట్ తాగడానికి ఉపయోగించే ప్రదేశాలను, సమయాలను వీలైతే దూరంపెట్టాలి. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం, కొత్త పనులతో బిజీ అవ్వడం చెయ్యాలి.

జిమ్ చేయడం మరియు నడక లాంటి మంచి అలవాట్లకు మారండి.

ఇవన్నీ చేస్తూ సంకల్పంతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు.

Leave a Comment

error: Content is protected !!