షుగర్ ఉన్న వాళ్ళకి అంగం గట్టి పడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు అన్ని వయసుల వారికి వస్తుంది. షుగర్ కోసం టాబ్లెట్స్, ఇంజక్షన్స్, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. దీనివలన షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వస్తూ ఉంటాయి. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దగా బాధపడరు కానీ మగవారిలో అంగస్థంభన సమస్య వస్తే చాలు చాలా బాధ పడతారు.
డయాబెటిస్ ఉన్న మగవారి లో అంగస్తంభన సమస్య ఎక్కువగా ఉంటుంది. షుగర్ వచ్చిన వారిలో వందలో 90 మందికి 7 నుంచి పదేళ్లు అయ్యేసరికి ఈ సమస్య ప్రారంభం అవుతుంది. అంగం గట్టిపడకుండా మెత్తగా ఉండటం వల్ల సంసార జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. షుగర్ వచ్చి 5 నుంచి 6 ఏళ్లు అయ్యేసరికి రక్తంలో చక్కెర స్థాయి పెరిగి రక్తం చిక్కగా అయిపోతుంది. దీని వలన రక్తప్రసరణ సరిగా జరగదు. అందుకే షుగర్ ఉన్నవాళ్ళకి కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడం, స్పర్శ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.
రక్తం చిక్కబడటం వలన రక్తనాళాలు హార్డుగా అయిపోతాయి. రక్తప్రసరణ సమస్యలు ఎక్కువ అవ్వడం వలన అంగ స్థంభన ఆశించిన విధంగా ఉండదు. అంగానికి కూడా రక్తప్రసరణ బాగా జరిగితేనే అంగస్థంభన జరుగుతుంది. మైండ్లో కోర్కెలు రాగానే శరీరంలో విడుదల అయ్యే హార్మోన్స్ వలన అంగానికి రక్తప్రసరణ జరిగి అంగం గట్టిపడి సైజు పెరుగుతుంది. షుగర్ ఉన్నవారిలో అంగానికి సరిపడినంత రక్తం సరఫరా జరగక అంగం గట్టిపడదు. ఈ ఆహార నియమాలు పాటిస్తే డయాబెటిస్ తగ్గి అంగస్తంభన బాగా జరుగుతుంది.
రోజు ఉదయాన్నే రెండు మూడు రకాల మొలకలు, చిన్న కర్బూజా లేదా పైనాపిల్ ముక్కలను కట్ చేసుకుని కలుపుకుని తినాలి. తర్వాత తినగలిగితే కొంచెం బొప్పాయి, కొంచం కర్బుజా ముక్క తినొచ్చు. మధ్యాహ్నం భోజనానికి అన్నం తిన కూడదు మొత్తానికి మానేయాలి. రెండు జొన్న రొట్టెలు లేదా పుల్కా తెనాలి మల్టీ గ్రైన్ పుల్కా అయితే ఇంకా మంచిది. రెండు రకాల కూరలు ఒక ఆకుకూర, ఒక వెజిటేబుల్ కూర రెండు కలిపి అర కేజీ లేదా ముప్పావు కేజీ ఉండాలి. భోజనం లో ఐదు గ్రాముల మెంతి పొడి కూడా తీసుకోవాలి.
రాత్రి ఫ్రూట్స్ తినాలి.జామకాయ, బొప్పాయి, ఆపిల్ ఏదైనా 7 గంటల్లోపు తినేయాలి. పడుకునే సరికి అరిగిపోయి రక్తప్రసరణ బాగా జరిగేలా ఉండాలి. దీనివలన కోర్కెలు రాగానే అంగానికి రక్త ప్రసరణ బాగా జరిగి అంగం గట్టి పడుతుంది. ఇలా రెండు నెలలపాటు ఈ ఆహార నియమాలు పాటించినట్లయితే డయాబెటిస్ తగ్గుతుంది. డాక్టర్ల సలహా మేరకు షుగర్ టాబ్లెట్ తగ్గించకోవచ్చు. షుగర్ కంట్రోల్ లోకి వస్తే ఎన్నో సంవత్సరాల నుండి అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఉపశమనం పొందవచ్చు.