ప్రస్తుతం అందరికీ ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి సమస్యల వల్ల పొట్ట పెద్దగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఆహార నియమాలు, వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ పొట్ట తగ్గట్లేదు. ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగినట్లయితే ఎంత వేలాడే పొట్ట అయినా సరే తగ్గిపోతుంది. మన సినిమా హీరోలు అందరూ ఈ డ్రింక్ తాగి పొట్ట రాకుండా జాగ్రత్త పడతారు. వరుసగా 15 రోజుల పాటు తాగినట్లయితే పొట్ట తగ్గిపోతుంది.
ఈ డ్రింక్ తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం మూడు నిమ్మకాయలు తీసుకుని బేకింగ్ సోడా వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత నిమ్మకాయలు కట్ చేసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. రసం తీసేసిన నిమ్మ చెక్కలను గిన్నెలో వేసి ఒక లీటర్ నీళ్ళు వేసుకోవాలి. దానిలో ఒక చెంచా నల్లమిరియాలు వేసుకోవాలి. రెండంగుళాల అల్లం ముక్క తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీసుకుని తురుముకుని వేసుకోవాలి. తర్వాత దీనిలో అంత రెండు అంగుళాల దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి.
ఈ నీటిని పది నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత నీటిని వడకట్టుకుని గ్లాసులో వేసుకుని ఒక చెంచా తేనె కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి. తాగిన అరగంట తర్వాత టిఫిన్ చేయాలి. ఇలా ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక పదిహేను రోజులపాటు తాగినట్లయితే పొట్ట అయినా సరే తగ్గిపోతుంది శరీరంలో పేరుకుపోయిన ఎంతటి కొవ్వు అయినా సరే ఈ డ్రింక్ ఈజీగా కరిగిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన మాకు పొట్ట తగ్గడం లేదు అని అనుకునే వారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి.
ఈ డ్రింక్ తాగడం వల్ల పొట్ట తగ్గడమే కాకుండా గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తగ్గడం వలన గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ డ్రింక్ తాగుతూ వ్యాయామం, ఆహార నియమాలు పాటించినట్లైతే 15 రోజుల్లో ఎంత పెద్ద పొట్ట అయినా సరే ఐస్ లాగా కరిగిపోతుంది. ఈ డ్రింక్ లో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించాము. కాబట్టి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. ఈ డ్రింక్ తాగడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది.