తమలపాకు చాలా మంది భోజనం తర్వాత కిల్లీకోసం ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా పూజలలో కూడా ఉపయోగిస్తాం. కానీ తమలపాకులో అనేక ఔషధగుణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.ఆయుర్వేదంలో చెప్పబడినట్టు దళసరి తీగజాతి ఈ చెట్టు ఆకులు అనేక చికిత్స ల్లో ఉపయోగిస్తారు. మన శశరీరంలో రోగనిరోధక శక్తి ని పెంచుతాయి. విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోప్లెవిన్, కెరొటిన్ , కాల్షియం మన శరీరం పనితీరును మెరుగుపరుస్తాయీ. ఈ ఆకులను తాంబూలం లో తీసుకోవడం వలన నోటికాన్సర్ సమస్య ను అధిగమిస్తారు. ఈ ఆకులను రోజుకు రెండు లేదా మూడు ఆకులను నమలడం వలన శరీరంలోని కొవ్వు ను కరిగిస్తుంది. జీర్ణక్రియ ను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం తగ్గిస్తుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి..
అధికబరువుతో బాధపడేవారు ఈ ఆకులో పది మిరియాలు పెట్టీ నమిలి తర్వాత గ్లాసు నీళ్ళు తాగడంవలన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.అలాగే గ్యాస్ వలన కడుపు లో వచ్చే పూతను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారికి చక్కెర స్థాయి అదుపు చేస్తుంది. ఈ ఆకులను కషాయంగా చేసుకుని తాగితే అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శుభ్రంగా ఆకులను కడిగి కాడలను తీసివేసి ఆకులను ముక్కలుగా చేసి నీటిలో వేసి మరిగించి నీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత నీటిని తాగాలి. స్త్రీల అండాశయ, గర్బకోశ సమస్యలు, పురుషులలో వీర్యవృద్దికి సహాయపడుతుంది. అలాగే రాత్రి నిద్రపోయేటపుడు లేదా భోజనానికి ముందు ఈ కషాయం తాగాలి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. సెక్స్ సమస్యలు తగ్గి సామర్థ్యం పెరుగుతుంది. తమలపాకు రసంతో తలకు మర్దనా చేస్తే తలనొప్పి, మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది.
తమలపాకు ను నుదుటి మీద రుద్దినా తగ్గుతుంది. చెవిపోటు ఉన్నప్పుడు ఈ రసాన్ని చెవిలో వేస్తే చెవినొప్పి తగ్గుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలకు తమలపాకు రసాన్ని ముఖానికి రాస్తే మచ్చలు తగ్గిపోతాయి. శరీరంలో విషపదార్థాలు బయటకు పంపించివేస్తుంది. రక్తప్రసరణ పెంచుతుంది. శరీర మెటబాలిజం పెంచుతుంది. చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఈ ఆకులను వేడిచేసి ఛాతిపై కట్టాలి. బ్రాంకైటీస్ ఉన్నవారు ఈ కషాయం తాగడంవలన కఫం తగ్గి ఇన్ఫ్లమేషన్ తగ్గించి బ్రాంకైటీస్ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకుల్లోని ఫాలీపినాల్ వలన ఈ ఆకుల్లోని రసాన్ని గాయాలపై అద్దితే త్వరగా మానిపోతాయి. కొన్ని ఆకులను ఉప్పుతో నూరి వేడీనీళ్ళతో తీసుకుంటే మూలవ్యాధి తగ్గుతుంది. తమలపాకుతో సున్నం వక్క కలిపి తింటే సున్నం ఎముకలు గుల్ల బారకుండా చేస్తుంది. కీళ్ళవాతం తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే మన పెద్దలు తమలపాకు ను తాంబులం ద్వారా మన ఆహారం లో భాగం చేసారు.ఇకపై తమలపాకు ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడండి.