మారేడు చెట్టు లేదా బిల్వ పత్రాలు ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనవి హిందూ పూజావిధానంలో. వినాయక చవితికి దేవుడికి సమర్పించే పత్రిలో మారేడు కూడా ఒకటి. ది నినే వెలగ అని కూడా అంటారు. దీని పండ్లు చూడడానికి చెక్కతో చేసినట్టు ఉంటాయి. కాయగా ఉన్నప్పుడు రుచిలో వగరుగా,పుల్లగా ఉంటే పండినపుడు తీపి పులుపు రుచిలో ఉంటుంది.
అలాగే మూడు ఆకులు ఉన్న మారేడు పత్రం బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులని నమ్ముతారు. ఈ చెట్టు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధాలుగా ఆయుర్వేదిక్ విధానంలో ఉపయోగపడతాయి. బిల్వ వృక్షములో ప్రతి భాగము మనుషులకు మేలు చేసే ఆయుర్వేద గుణాలున్నదే.
మారేడుదళము గాలిని, నీటిని వడకట్టి కాలుష్యరహితము చేస్తుంది. అనేక వైరల్ ,ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.
మారేడు చెట్టు యొక్క పండ్లు, మారేడు కాయలు, చెట్టు బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు అన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి.
అతిసారం అనే వ్యాధికి మారేడు పండ్లతో చేసిన రసం చాలా మంచి మందు.
ఆయుర్వేదములో వాడు (దశమూలములాలలో) పది ముఖ్యమైన వేర్లలో దీని వేరు కూడా ఒకటి. రక్తమొలలకు ఈ వేరుపొడి మంచి ఔషధము.
దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు నియంత్రిస్తుంది.
మారేడు ఆకులు కొద్దిపాటి జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె కలిపి ఈ కషాయం తాగితే జ్వరము త్వరగా తగ్గుతుంది .
కడుపులోను, పేగులలోని అల్సర్పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, పండ్లకు ఉన్నది,
మలేరియా జ్వరమును తగ్గించే గుణము బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది.
మారేడుపండు నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇన్ఫెక్షన్లు ఇబ్బందులనుండి ఉపశమనం ఇస్తుంది.
మారేడు వేర్లు, బెరడు, చెట్టు ఆకులను ముద్దగా నూరి గాయాల మీద రాస్తే గాయాలు త్వరగా మానుతాయి.
క్రిమి, కీటకాలు, విషపురుగుల యొక్క విషానికి విరుగుడుగా పనిచేస్తుంది ఈ ఆకులరసం విరుగుడుగా పనిచేస్తుంది.