you must know hidden health benefits of bitter gourd

వారంలో కనీసం ఒక్కరోజైనా ఈ కూరగాయ వండుకుని తింటే జబ్బులన్ని పారిపోతాయి!!

చదువురాని వాడు కాకరకాయ అంటే, చదువు వచ్చిన వాడు కీకరకాయ అన్నాడట. చదువురాని మన పెద్దలు కొందరు కాకరకాయ గొప్పతనం తెలుసుకుని ఎంచక్కా బోలెడు రకాలుగా వండుకుని తినేవాళ్ళు. కానీ నేడు చదువుకున్నవాళ్ళు మూర్ఖులు లాగా కేవలం రుచికి ప్రాధాన్యత ఇస్తూ కాకరకాయను దూరం పెట్టేస్తున్నారు. మామూలు గా అందరికీ కాకరకాయ తింటే షుగర్ తగ్గుతుంది అదుపులో ఉంటుంది అని తెలుసు. కానీ కాకరకాయ వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 

◆పచ్చని తాజా కాకరకాయల్లో ఏ బి సి వంటి విటమిన్లు, బీటా కెరోటిన్ వంటి ప్లవోనాయిడ్స్,  కెరోటిన్, లుటీన్, ఐరన్ ,జింక్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి విటమిన్లు విరివిగా లభిస్తాయి.

◆తాజా కాకరకాయ రసం తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు ఆయిన ఆస్తమా, అలర్జీ, జలుబు, దగ్గు మొదలైన వాటికి చాలా ఉపశమనంగా ఉంటుంది. కాకరకాయ అధికంగా తీసుకున్న వారికి అంటు వ్యాధులు దూరంగా ఉంటాయి. కాకర జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది మలబద్దకాన్ని నిరోధిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన  మలినాలను బయటికి తొలగిపోయేలా చేసే శక్తికాకర కి ఉంది

◆ ఇక అతిముఖ్యంగా చెప్పుకోవాల్సింది మధుమేహం గురించి, కాకర తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకరలో ఇన్సులిన్ కి సంబంధించిన రసాయనాలు అధికంగా ఉండడం వల్ల కాకర మధుమేహాన్ని అద్భుతంగా అదుపులో ఉంచుతుంది. మధుమేహం తొలిదశలో ఉన్నప్పుడు మందులు ఇంజక్షన్స్ కంటే కూడా కాకర వల్ల మధుమేహానికి  సత్వర ఉపశమనం లభిస్తుంది.

◆ కాకర తినడం మావల్ల కాదు అనే బద్దకిస్టులు  జ్యూస్ చేసుకుని తాగవచ్చు, దాన్ని కూడా వాక్… చేదు అని ముఖాన్ని మాడ్చుకోకుండా అందులో కొంచెం నిమ్మరసం, తేనే వేసుకుని తీసుకుంటే బాగుంటుంది. కాకర జ్యూస్ వల్ల చాలా ఆనారోగ్య సమస్యలకి దూరంగా ఉంటారు.

◆. రక్తపోటును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులనీ నిరోధిస్తుంది. క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే మన అర చేతిలోనే ఉన్న సర్వరోగ ఆరోగ్య ప్రదాయిని కాకర అన్నమాట.

.◆ చాలామంది వంటలు చేసేటపుడు కాకర మీద ఉన్న బొడిపేలు తీసేసి వండుతుంటారు కానీ కాకర పైన బొడిపెలా ఉన్న వాటితో సహా ఉపయోగించాలి. 

◆కాకర ఆకులు కూడా పలు రకాలుగా  ఉపయోగపడతాయి. కుక్క కరిచినప్పుడు  లేదా ఏమైనా విషపు పురుగులు కుట్టినప్పుడు కాకర ఆకులను నలిపి లేదా మెత్తగా ముద్దగా నూరి అక్కడ పట్టుగా వేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంటే విషం మిగిలిన శరీర భాగాలకు వ్యాపించకుండా ఫస్ట్ ఎయిడ్ లా పని చేస్తుందన్నమాట.

 చివరగా…..

ఇన్ని ప్రయోజనాలు ఉన్న కారకాయను అసలు వధులుకోకండి. కొన్నింటికి మన సొంత ఇంటి వైద్యాలు  అమోఘంగా పని చేస్తాయి. ఆలాంటివి ఉపయోగించి రోగాలను దూరంగా తరిమికొట్టి మనం ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలంటే కాకరకాయకు సెల్యూట్ చేయాల్సిందే.

Leave a Comment

error: Content is protected !!