black fungus symptoms and how it will attack

క*రోనా ఆగింది.బ్లాక్ ఫంగస్ మొదలయింది. ఇది ఎలా సోకుతుంది

దేశంలో కరుణ మహమ్మారి రోజురోజుకీ చాలా తీవ్రంగా విజృంభిస్తోంది.. అయితే క*రోనా మహమ్మారి జయించాము అనే సంతోషం కూడా లేకుండా వారికి నిద్ర లేకుండా చేస్తుంది ఈ బ్లాక్ ఫంగస్. ఈ ఫంగస్ ముఖ్యంగా క*రోనా నుండి కోలుకున్న రోగుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ ,గుజరాత్లో ఇప్పటికే ఈ వైరస్ సోకి ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికే తెలంగాణలో కూడా ఈ వైరస్ సోకి కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు. ఈ ఫంగస్ వలన కంటి చూపు కోల్పోతున్నారు.దీనివలన కంటిచూపు కోల్పోవాల్సినదేనా. ఈ ఫంగస్ నుండి ఎలా జాగ్రత్త పడాలి. బ్లాక్ ఫంగస్ నుండి ఎలా రక్షించుకోవాలి. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 క*రోనా వలన ఇప్పటికే ఎంతమంది ఎంత బాధ పడుతున్నారో మనందరికీ తెలిసిందే. క*రోనా నుండి కోలుకున్న చాలామందిలో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ సోకి ఇబ్బంది పెడుతుంది. ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరమైనది. ఈ ఫంగస్ లక్షణాలు గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవడం వల్ల ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి సోకదు. క*రోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతుంది. కానీ బ్లాక్ ఫంగస్ అలా ఒకరి నుండి మరొకరికి అంత త్వరగా సోకదు. క*రోనా నుండి కోలుకున్న రోగులకు మాత్రమే త్వరగా సోకుతుంది. క*రోనా వలన శరీరంలో ఇమ్యునిటీ తగ్గినా వ్యక్తులకు  బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుంది. క*రోనా నుండి కోలుకున్న డయాబెటిస్ రోగుల్లో ఇది ప్రమాదకరంగా మారింది.

 ఎందుకంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి రెండు రకాలుగా ఉంటుంది. మన శరీరంలోకి ఏదైనా వైరస్ సోకినప్పుడు యాంటీ బాడీ వాటితో పోరాడడానికి సిద్ధంగా ఉంటాయి. ఇంకొక రకం మన శరీరంలో అమీబాలా వృద్ధి చెందుతూ ఉంటాయి. వీటినే తెల్లరక్తకణాలు అంటారు. మన శరీరంలోకి సోకే వైరస్ ని తినేసి  వాటిని నాశనం చేస్తాయి. దీన్ని స్వయంచాలిత రోగనిరోధక శక్తి అంటారు. చక్కెర స్థాయిలు అదుపులో లేని డయాబెటిస్ రోగుల్లో ఇది ప్రమాదకరంగా మారుతుంది. డయాబెటిస్ రోగుల్లో ఈ సెల్ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. వారిలో ఇమ్మ్యూనిటి తగ్గడం వల్ల ఈ సెల్ ఇమ్యూనిటీ కణాలు బ్లాక్ ఫంగస్ విత్తనాలు ముక్కు ద్వారా, అక్కడి నుండి చర్మంలోకి, తర్వాత ఇతర శరీర భాగాల్లోకి చేరడం జరుగుతుంది. 

స్టెరాయిడ్లు తీసుకోవడం వలన కూడా ఈ బ్లాక్ ఫంగస్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ ఇమ్యూనిటీ తగ్గడం వలన వస్తుందని చెప్తున్నారు. స్టెరాయిడ్లు తీసుకోకపోయినా ఎవరికైతే క*రోనా తగ్గిన వెంటనే బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్తో చికిత్స తీసుకోవాలి. నెల రోజుల తర్వాత కూడా ఈ ఫంగస్ బారినపడే అవకాశం ఉంది. ఈ ఫంగస్ లక్షణాలు ఏంటంటే విపరీతమైన తలనొప్పి, కంటి నొప్పి, దవడ ఎముక నొప్పి, కంటిచూపు మందగించడం, కళ్ళల్లో నుంచి నీరు కారడం, చూసే వస్తువు స్పష్టత కోల్పోవడం ఈ ఫంగస్ యొక్క లక్షణాలు. కొంతమందిలో ముక్కునుండి నల్లటి ద్రవం కారడం కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. క*రోనా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంటే బ్లాక్ ఫంగస్ కంటిపై ప్రభావం చూపుతుంది. 

ముఖ్యంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వైరస్ వలన ఇంత ప్రభావం చూపించడానికి గల కారణం ఇది చర్మంలో చొచ్చుకుపోయి రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. ఇలా జరగడం వలన అవయవం చచ్చుపడిపోయే అవకాశం ఉంది. ఈ వైరస్ చచ్చుపడిపోయిన ప్రాంతంలో బాగా అభివృద్ధి చెంది ఆ అవయవాన్ని తినేస్తుంది. దీని వలన సులభంగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీని లక్షణాలు కనిపించగానే డాక్టర్ సలహా తో మందులు వాడటం ప్రారంభించాలి. ప్రారంభదశలోనే చికిత్స తీసుకోవడం వలన ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉంది. అందుకే క*రోనా సోకిన వ్యక్తులు ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ధాన్యాలు, చికెన్, గుడ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ముందుగా ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మాస్క్ వాడటం తప్పనిసరి. దీనివల్ల వైరస్ ముక్కులోకి ప్రవేశించకుండా అడ్డుకోగలం.

Leave a Comment

error: Content is protected !!