black raisins health benefits

నరాలు బలహీనత, నరాల్లో వాపు, వెరికోన్ వెయిన్, కీళ్ళనొప్పులు శాశ్వతంగా తగ్గించే చిట్కా

కాళ్ళ పై నరాలు ఉబ్బి బయటకు కనిపించే వాటిని వెరికోస్ వెయిన్స్ అంటారు.వీటిని స్పైడర్ వెయిన్ అని కూడా అంటారు. ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అసలు వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయో వాటి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో నరాలది పెద్ద వ్యవస్థ. ఇవి మన శరీరం అంతా రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటిని ధమనులు అని పిలుస్తారు. ఆ కణజాలాలలో వెలువడే మలినాలను ఊపిరితిత్తులకు అక్కడి నుండి గుండెకు తీసుకుపోయే వాటిని సిరలు అని పిలుస్తారు. ఇవి  మన శరీరంలో రక్తప్రవాహాలుగా పని చేస్తారని తెలుసు కదా.

 ఇవి పని చేయడం వల్ల గుండెకి రక్తం అందుతుంది. గుండె పంప్ చేసిన రక్తం ఇతర అవయవాలకు చేరుతుంది. ఈ రెండింటినీ కలిపి రక్తనాళాలు అంటారు. సిరల్లో అక్కడక్కడా కొన్ని కవాటాలు ఉంటాయి. ఇవి గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ సిరలు కిందనుంచి పైకి రక్తాన్ని గుండె కు చేరవేస్తాయి. ఇక వాటిల్లో ఏమైనా అడ్డంకులు ఉన్నా, మూసుకుపోయిన ఏం జరుగుతుందంటే రక్తం వ్యతిరేకదిశలో కిందకు వెళ్లి పోతుంది లేదా రక్తం దేశంలోనే బ్లాకై ఆగిపోతుంది. దీంతో అక్కడ ఆగిపోయిన రక్తం గుండెకు చేరక బలహీన పడతాయి.

 ఇవి ఉబ్బిపోయి బయటకి పచ్చగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ నరాలు ఉబ్బిపోయి వాపు కూడా వస్తుంది. నొప్పి కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు డాక్టర్లు సర్జరీ తప్ప వేరే మార్గం లేదని సూచించవచ్చు. ఈ సమస్య తీవ్రం అయిపోతే కాళ్లు చేతులు కదిలించాలి అన్నా విపరీతమైన నొప్పి రావచ్చు. అందుకే ప్రారంభదశలోనే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలతో నయం చేసుకోవచ్చు. అప్పుడు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు ఉదయం ఈ చిట్కా తీసుకుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి. 

దీని కోసం కావలసినవి ఎండు నల్లద్రాక్ష. నల్ల ద్రాక్ష ఏడెనిమిది తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి . తర్వాత పదార్థం చియా సీడ్స్ ఒక స్పూన్ తీసుకోవాలి. వీటిలో కూడా ప్రొటీన్, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి నరాల్లో బ్లాకేజ్ను  తొలగించడంలో చాలా బాగా సహాయపడుతాయి. తర్వాత పదార్థం  అవిస గింజలు. ఈ గింజలు నరాల్లో పేరుకొన్న కొవ్వు, అడ్డంకులను తొలగించి నరాలు నొప్పి తగ్గిస్తుంది. దీనికోసం అవిసె గింజలను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూడా ఒక స్పూన్ గిన్నెలో వేసుకోవాలి.

 ఈ మూడు పదార్థాలను మునిగే వరకు నీటిలో వేసి మూడు నాలుగు గంటలు నానబెట్టాలి లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే పరగడుపున టిఫిన్ తినడానికి అరగంట ముందు తీసుకోవడం వలన నరాల ఉబ్బు, అడ్డంకులు నరాల బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీనిని తప్పకుండా ప్రతిరోజూ తీసుకోండి. ప్రతిరోజు మసాజ్ చేయడం వలన కూడా ఈ నరాల ఉబ్బు లేదా వెరీ కోన్ వైన్స్ అనేది తగ్గుతుంది.

Leave a Comment

error: Content is protected !!