blood improvement fruits and vegetables

దీనితో వంద రోగాలు వరకు శాశ్వతంగా మాయం…… రక్తం వద్దన్నా పుష్కలంగా పడుతుంది……. కాల్షియం అనంతం……. దీన్ని చిటికెడు తింటే చాలు…

ఈరోజు మనం అనేక పోషకాలు అందించే అత్యంత న్యూట్రిషన్స్ కలిగిన అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకుందాం. కానీ ఆ పదం వింటే ఇది మన వల్ల కాదు అనిపిస్తుంది. కానీ దీనిలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే ఏదో ఒక రకంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే తౌడు. 100 గ్రాముల తౌడుని తీసుకుంటే 316 క్యాలరీల శక్తి లభిస్తుంది. అంటే ఇది కోడి, మేక మాంసం కంటే మూడు వంతులు ఎక్కువ. చేపలకు కోడులకు బలానికి వాడేది తౌడు. అన్నిటికీ మనం తౌడు పెట్టి మనం మాత్రం పోషకాలు లేని తెల్లటి బియ్యం ఆహారంగా తీసుకుంటున్నాం.

                    ఇందులో ప్రోటీన్ 14 గ్రాములు ఉంటుంది. తెల్లటి బీయ్యంలో ప్రోటీన్ ఉండదు. కార్బోహైడ్రేట్స్ 50 గ్రాములు ఉంటాయి. ఫ్యాట్ 20 గ్రాములు ఉంటుంది. అందువల్లనే తౌడు నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ తీస్తారు. ఫైబర్ 21 గ్రాములు ఉంటుంది. తెల్లటి బీయ్యంలో ఒక గ్రాము ఫైబర్ కూడా ఉండదు. అందువలన పేగుల క్లీనింగ్ కు, పేగులలో హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియా పెరుగుదలకు, మలబద్ధకం రాకుండా చేయడానికి ఇందులో ఉండే ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. పేగులకు మైక్రో న్యూట్రియంట్స్ బాగా అందించడానికి తౌడు బాగా సహాయపడుతుంది.

                       అన్నిటికంటే ఎక్కువగా శరీరంలో రక్తం తయారు కావడానికి కావలసిన ఐరన్ తౌడులో పుష్కలంగా ఉంటుంది. ఇందులో 35 నుంచి 45 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందువలన ఎవరికైతే రక్తం తక్కువగా ఉండేవారు ఐరన్ క్యాప్సిల్స్ బదులుగా తౌడును వాడుకుంటే చాలా మంచిది. ఎముకలు తయారీకి కాల్షియంతో పాటు ఫాస్పరస్ కూడా కావాలి. ఇందులో దగ్గర దగ్గరగా 1677 మిల్లీగ్రాముల ఫాస్పరస్ ఉంటుంది. అంటే ఎముకల కోసం ఇది చాలా విలువైనది. అలాగే ఇందులో పొటాషియం1485 మీల్లి గ్రాములు ఉంటుంది.

                      మెగ్నీషియం 781 మిల్లి గ్రాములు. రక్షణ వ్యవస్థకు కావాల్సిన జీంక్ 8 మిల్లి గ్రాములు ఉంటుంది. రక్షణ వ్యవస్థకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి సిలినియం15.6 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన బి కాంప్లెక్స్ కూడా పుష్కలంగా ఇందులో లభిస్తాయి. అందువలన తౌడును శరీరానికి కావలసిన పోషకాలు గని అంటారు. ఇలాంటి తౌడు రైస్ మిల్లులో బాగా లభిస్తుంది. ఇలాంటి తౌడును పుల్కా లాంటి వాటిలోనూ, కొంచెం పోడి అన్నంలో కలుపుకొని తినవచ్చు..

Leave a Comment

error: Content is protected !!