Blood Improvement homeremedy

ఇది కొంచెం నాకితే చాలు…….. మూడు లీటర్ల రక్తం ఫుల్లుగా పట్టేస్తుంది…

మనం ఏ పని చేయాలి అన్నా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి అన్న మన శరీరంలో రక్తం అనేది సరిపడా ఉండాలి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కరెక్ట్ గా ఉండాలి. స్త్రీలలో 12-14గ్రాలు, మగవారిలో 14-16గ్రా లు ఉంటే హెల్తీగా ఉన్నట్లు పరిగణిస్తారు. హిమోగ్లోబిన్ తయారీ అవ్వాలి అంటే మనకు ఐరన్ కావాలి. ఇది రోజుకి 25-38 మిల్లిగ్రాములు కావాలి. ఈ ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న సరే చాలామందిలో ఐరన్ లోపం ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే మనం తీసుకున్న ఆహారంలో ఐరన్ ఉన్నప్పటికీ అది ఒంటికి పట్టకుండా 60% బయటికి పోతుంది.

ఈ ఐరన్ వంటివి పట్టేటట్టు చేసేది విటమిన్ సి. తినే ఆహారాలు అన్ని వండుకొని తిన్నప్పుడు విటమిన్ సి నశిస్తుంది. విటమిన్ సి నశించినప్పుడు ఐరన్ మోషన్ లో బయటకు పోతుంది. ఈ విటమిన్ సి చిన్నప్రేగులలో ఐరన్ తో కలిసి బంధాన్ని ఏర్పరచుకొని పేగుల నుంచి రక్తంలోకి చేరుతుంది. అందువలన శరీరంలో రక్తం పెరగాలంటే, ఐరన్ హిమోగ్లోబిను పుష్కలంగా లభించాలి. అంటే మీరు విటమిన్ సి, ఐరన్ కాంబినేషన్లో ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వండిన ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉన్నప్పుడు దానితో పాటు విటమిన్ సి లభించే ఆహారం కూడా తీసుకోవాలి.

అంటే భోజనం తిన్న తర్వాత విటమిన్ సి గల జామకాయను మూడు నాలుగు ముక్కలు తినాలి. లేదా ఉడికించిన కూరలపై నిమ్మకాయ రసం పిండుకొని అన్న తీసుకోవచ్చు. లేదా భోజనం అయిన తర్వాత పెద్ద ఉసిరికాయ ముక్కలు ఒక నాలుగు తినండి. ఈ రూపాల్లో విటమిన్ సి మన శరీరానికి అందిస్తే ఉడికించిన ఆహారంలోని ఐరన్ ను మన శరీరానికి అందిస్తుంది. ఐరన్ ఎక్కువగా లభించే ఆహారం అంటే క్యాలీఫ్లవర్ యొక్క కాడలు. మరియు తౌడులో ఎక్కువగా ఉంటుంది. ఆకు కూరలో కంటే వీటిలో ఎక్కువగా లభిస్తుంది.

విటమిన్ సి తోడుంటే ఐరన్ శరీరానికి లభిస్తుంది. అని సైంటిఫిక్ గా నిరూపించినవారు 1980 యూనివర్సిటీ ఆఫ్ కేన్సస్ మెడికల్ సెంటర్ యూఎస్ఏ వారు. విటమిన్ సి కాంబినేషన్లో ఐరన్ ఇస్తే 67% అబ్జర్వ్ అవుతుందని, కాంబినేషన్ లేకపోతే అంతా లాస్ అవుతుంది. అని ఎక్స్ట్రా ఐరన్ గ్రహించడానికి విటమిన్ సి కాంబినేషన్ అద్భుతం అని నిరూపించారు. కనుక ఇలా ఇటువంటి ఆహారపు శ్రద్ధ వహిస్తే మన ఆరోగ్యానికి మంచిది అని నిరూపించారు………

Leave a Comment

error: Content is protected !!