అనారోగ్యం లేని మనిషంటూ ప్రస్తుతం లేడని అనిపిస్తుంది. చిన్నవో, పెద్దవో శరీరాన్ని చుట్టుముట్టి ఎన్నివిధాలుగా కావాలంటే అన్ని విధాలుగా కబళిస్తుంది. అయితే మనల్ని చుట్టుముట్టిన ఆ జబ్బు ఏదైనా కొన్ని లక్షణాలను అనుసరించి వాటి స్థాయిని అంచనా వేయచ్చనేది ఎవరికి పెద్దగా తెలియని నిజం. అయితే అవేమిటో ఒకసారి తెలుసుకుంటే మనకేం జబ్బోచ్చినా దాన్ని సులువుగా అంచనా వేసి తీవ్రతను బట్టి తక్షణచర్యలు తీసుకోవడం వంటివి చేయవచ్చు. మరి అవేంటో చదవండి.
◆ నొప్పి అనే కరణంఘో వచ్చే వ్యఫుల విషయంలో నొప్పి ఒకచోట మాత్రమే వస్తుందా లేక అనేక చోట నొప్పి వస్తోందా అనేది నిశితంగా పరిశీలించుకోవాలి.
◆ నొప్పి ఎలా మొదలవుతోంది ఎంత సేపటివరకు ఉంటోంది అనేది గమనించాలి.
◆ రోజులో ఆ నొప్పి ఏ సమయంలో వస్తుంది, అది రావడానికి ముందు వెనుక మనం చేసిన పనులు, తీసుకున్న ఆహారం, ఎదుర్కొన్న సంఘటనలు, ఎదురైన సందర్భాలు వంటివి పునరుశ్చరణ చేసుకోవాలి.
◆ నొప్పి వచ్చినపుడు మన స్పందనల్లో దేనివల్ల అది తగ్గుతోంది అనే విషయాన్ని స్పష్టం చేసుకోవాలి.
◆ నొప్పి ఉన్న సమయంలో ఏ ఇతర పనులైన చేసుకునే సామర్థ్యము ఉంటోందా లేదా అనేది శరీర సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.
◆ వచ్చిన సమస్య కేవలం మనకు మాత్రమే ఉందా?? లేదా కుటుంబంలో ఎవరికైనా ఉందా?? వంశపారంపర్యంగా ఎదురవుతున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటివి తెలుసుకోవాలి.
◆ సాధారణంగా ఒక చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వైపు కొన్ని అనారోగ్యం కు కారణం అవుతాయి. కాబట్టి దానికి మూలాన్ని కనుగొనాలి.
◆ శరీరంలో నొప్పితో పాటు వాపు, తిమ్మిర్లు వంటి ఇతర లక్షణాలు ఉన్నాయా అనేది పరిశీలించుకోవాలి.
ఉదాహరణకు రుమాటాయిడ్ ఆర్థ్రయిటీస్ లో మొక్కలు కుక్క మూతిలాగా అయిపోతుంది. అందుకని దీన్ని ఆయుర్వేదంలో క్రోష్టుశీర్షం అంటారు. ఇలా అనేక ప్రశ్నలతో శరీరంలో ఇతర అవయవాల పనితీరును కూడా అంచనా వేసి, అపుడు రూమటిక్ వ్యాధి సాధ్యమో, అసాధ్యమో నిర్ధారించగలుగుతారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే, కీళ్లనొప్పులకు మందులు వాడుతూ దీర్ఘకాలంగా ఇది కొనసాగడం వల్ల, గుండెనొప్పి వచ్చి రోగి మరణించే అవకాశం ఉంటుంది.
వాతం ప్రకోపం చెంది రుమటాయిడ్ కలుగజేస్తుంది. అందువల్ల ఒళ్ళంతా నొప్పి, బాధ, వాపు, శరీరంలో అదురు, వణుకు వంటివి ఏర్పడతాయి.
-నొక్కితే నొప్పి, తాకితే వేడి, వాపు జాయింట్లలో కనిపిస్తుంది.
– చేతి మణికట్టు, చేతి వేళ్ళు ఎక్కువగా బాధని కలిగిస్తాయి.
– మెడ, భుజాలు, మోచేతులు, మోకాళ్ళు, పాదాలలోకి ఈ వ్యాధి త్వరగా ప్రవేశిస్తుంది.
– మనిషి నిస్త్రాణం అవుతారు. అపుడపుడు జ్వరం, ఒంట్లో ఏమీ బాగోలేదు అనిపించే లక్షణాలు కనిపిస్తాయి.
– ఉదయం నిద్రలేవగానే అవయవాలు బిగుసుపోయినట్టు ఉంటాయి.
– ఈ నొప్పులు దీర్ఘకాలం పాటు వేధిస్తుంటాయి.
చివరగా……
పైన చెప్పుకున్నట్టు ఒక సమస్య లక్షణాలు, ఆ సమస్య యొక్క తీవ్రతను స్పష్టం చేస్తాయి. దీన్ని అనుసరించి వైద్యున్ని కలిసే ఆవశ్యకత కూడా మనకు అర్థమవుతుంది.