boiled ground nut health benefits

ఉడికించిన వేరుశనగ రోజూ తింటే ఏమవుతుందో తెలుసా??

పేదోడికి డ్రై ఫ్రూట్స్ ఎక్కన్నుంచి వస్తాయి. కొనే తాహతు లేక కాముగ ఉంటారు. మరి వారికి పోషకాలు కావద్దూ?? పోషకాలు డ్రై ఫ్రూట్స్ లొనే ఉంటాయా ఏంటి. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలను నింపుకున్నవి అందరికి అందుబాటులోనే ఉంటాయి కానీ ఎవరికి తెలియదు పెద్దగా. డ్రై ఫ్రూట్స్ తో సమానంగా పోషకాలు నింపుకున్న వేరుశనగ గూర్చి అందులో ఉన్న రహస్యం గూర్చి మీకోసం.

◆ఉడికించిన వేరుశనగలో విటమిన్- ఇ పుష్కలంగా లభిస్తుంది. అలాగే శరీరంలో అవయవాల ఎదుగుదలకు ఉపయోగపడే బి కాంప్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి.  విటమిన్-బి శరీరంలో ఎర్ర రక్తకణాల పెరుగుదలకు తోడ్పడుతుంది.

◆ఉడికించిన వేరుశనగ లో డ్రై ఫ్రూట్స్ తో సమానంగా పోషకాలు ఉంటాయి.  కాబట్టి ఆర్థికంగా దిగువ, మధ్యతరగతి వారికి కావలసిన పోషకాలు ఇందులో లభ్యమవుతాయి.

◆ వేయించిన వేరుశనగలో  క్యాలరీలు అధికంగా ఉంటాయి అదే ఉడికించిన వేరుశనగ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు గురించి భయపడేవారు వేరుశనగను ఉడికించి తీసుకోవచ్చు.

◆ఉడికించిన వేరుశనగ ను వేయించిన వాటితో పోలిస్తే ఉడికించిన వాటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణాశయ సంబంధ సమస్యలను సులువుగా నయం చేస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.

◆ వేరుశనగలో మోనోసాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల మంచి కొవ్వులు లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి

◆మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం కు మధ్య సమయంలో అంటే సాయంకాలపు స్నాక్స్ సమయంలో గుప్పెడు ఉడికించిన  వేరుశనగలు తీసుకోవడం వల్ల సాయంత్రం పూట ఆవహించే నీరసం నుండి దూరంగా ఉండచ్చు. 

◆ ఉడికించిన వేరుశనగ తీసుకోవడం వల్ల  మెదడు మరియు శరీర కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

◆ ప్రతిరోజు ఉడికించిన వేరుశనగను విధిగా తీసుకోవడం వల్ల వీటిలో ఉన్న మెగ్నీషియం ఎముకలు మరియు నరాలని ఉత్తేజితం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.

◆వేరుశనగల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ ఎక్కువమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో రక్షణ వ్యవస్థకు నష్టం కలిగించే  ఫ్రీరాడికల్స్ తో సమర్థవంతంగా పోరాడి క్యాన్సర్, గుండెజబ్బులు, షుగర్ వంటి సమస్యలు రాకుండా దూరంగా ఉంచుతుంది.

చివరగా……

పైన చెప్పుకున్నవే కాకుండా వేరుశనగ ను సమతుల్యత డైట్ లో చేర్చవచ్చు. బరువు ఉన్నవాళ్లకి బరువు తగ్గించడానికి, పోషక లోపం తో ఉన్నవాళ్ళకు పోషకాలను అందిస్తూ బరువు పెరగనివ్వకుండా చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న వేరుశనగను ప్రతి ఒక్కరూ రోజువారీ ఆహారం లో చేర్చుకోవలసిందే

Leave a Comment

error: Content is protected !!