bone health supplements

90 సంవత్సరాలు వచ్చినా సరే నడుస్తునే ఉండాలి అంటే………ఈ ఒక్క పని చేయండి చాలు హాస్పటల్ కి వెళ్ళే పనే ఉండదు……

 ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు బట్టి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో బలహీనతలు ఏర్పడుతూ కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, త్వరగా అలసిపోవడం వంటివి ఎక్కువ అవుతూ  ఉంటాయి. పూర్వం రోజుల్లో మన పెద్దలైన వారు ఎంత వయసు పైబడిన వారి పనులు వారు చేసుకుంటూ ఆరోగ్యకరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మనం తీసుకునే ఆహార లోపం వలన చిన్న వయసులోనే బలహీన పడిపోతు ఉన్నారు. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమిడి రోజు తీసుకోవడం వలన ఇటువంటి బలహీనతల నుంచి విడుదల పొందవచ్చు.

                              ఇది తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం మనకి నువ్వులు కావాలి. నువ్వులలో కాల్షియం, విటమిన్ సి, ఐరన్, ఫైబర్, ప్రోటీన్స్ లాంటివి పుష్కలంగా లభిస్తాయి. అందువలన దీనిని మంచి పౌష్టిక ఆహారంగా చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తెల్ల నువ్వులను ఒక గుప్పెడు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఒక స్పూన్ బెల్లం పొడిని తీసుకోవాలి.

                      దీనికోసం ఆర్గానిక్ బెల్లం తీసుకోవాలి. ఈ రెండిటిని బాగా కలుపుకొని రోజు సాయంత్రం సమయంలో తీసుకోవాలి. రెండవ రెమిడి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. తరువాత ఐదు నానబెట్టిన బాదంపప్పులను తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఈ బాదం పప్పులను పాలతో కలిపి తీసుకోవచ్చు లేదా కొన్ని పాలు తాగుతూ ఒక పప్పు తింటూ మరల పాలు తాగుతూ ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. బాదంపప్పులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఈ విధంగా తీసుకోవాలి.

                      ఈ విధంగా ఉదయం పూట పాలు మరియు బాదం పప్పును, సాయంత్రం సమయంలో నువ్వుల పొడి మరియు బెల్లం కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీనివలన ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన బలాన్ని ఇవి అందిస్తాయి. మరియు మెదడు యొక్క పనితీరును కూడా పెంచుతాయి. దీని ద్వారా వయసు పైబడిన మతిమరుపు లాంటి సమస్యలు కూడా ఉండవు…

Leave a Comment

error: Content is protected !!