మన శరీరాన్ని ఎముకల గూడు అంటారు. ఒక భవనానికి స్తంభాలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఎముకలు మన శరీరానికి అదే విధంగా ఉపయోగపడతాయి. అటువంటి ఎముకలలో క్యాల్షియం, ఫాస్ఫరస్ తగ్గి ఎముకలు గుల్లబారిపోయి ఎముకలు అరిగిపోవడం మరియు విరిగిపోవడం అంటే సమస్యలకు గురి అవుతున్నారు. మనకు ఎండ సరిగ్గా తగలకపోవడం, క్యాల్షియం లోపం, ఇలా అనేక కారణాలతో మన ఎముకలకు ఇబ్బంది కలుగుతున్నాయి. ఇలాంటి వాటిని నివారించడానికి వెల్లుల్లిపాయలు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
2020 సంవత్సరంలో వాషింగ్ టన్ స్టేట్ యూనివర్సిటీ యూఎస్ఏ వారు వెల్లుల్లి ఎముకల గూడు ప్రతిష్టంగా చేయడానికి ఉపయోగపడుతుంది. అని సైంటిఫిక్ గా నిరూపించారు. వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది. ఇందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ లో ఒకటైన అల్సీన్ అనేది ఎముకలకు ఉపయోగపడుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఎముకలలోని ఆస్ట్రియో బ్లాస్ట్ కణాలను కాస్త ఎక్కువగా ఉత్పత్తి చేసి బోన్ రీ మోడలింగ్ చేయడానికి బోన్ లోపలికి బోన్ సెల్స్ లోపలికి క్యాల్షియం ఫాస్ఫరస్ ను ఇతర మినరల్స్ ను బోన్ లోపలికి వెళ్ళేటట్టు చేస్తుంది.
అంటే మీరు క్యాల్షియం తిన్నా అది ఒంటికి పట్టాలంటే సల్ఫర్ కాంపౌండ్స్ కావాలి. మనం ఆకుకూరలు తింటాం, అదేవిధంగా నువ్వులు ఉండలు తింటాం అయినా సరే కొంతమందికి బోన్స్ బలంగా ఉండవు. అలాగే ఎముకలకు ఉండే ప్రోటీన్ స్ట్రక్చర్ లో ప్రోటీన్ బాగా పట్టేటట్టు ఎముకల కణాలు అన్ని చాలా హెల్తీగా అయ్యేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఎముకల కణాలకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగి ఎముకల కణాలు అన్ని బలహీనపడతాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి వెల్లుల్లిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉపయోగపడతాయి.
అందువలన మన పెద్దలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని అంటారు. ఇది సైంటిఫిక్ గా కరెక్ట్ అని కూడా నిరూపించబడింది. మనం వెల్లుల్లిపాయలను తాలింపు దాకలో వేసుకుంటాం. ఇలా వేడివేడి నూనెలో వేయడం ద్వారా అందులో ఉండే సల్ఫర్ వంటి కాంపౌండ్స్ తగ్గిపోతాయి. అందువలన ఇటువంటి వెల్లుల్లిపాయలను ఉల్లిపాయలు, తాలింపులు అన్ని వెగిన తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసుకుంటే ఈ కెమికల్ కాంపౌండ్స్ ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. ఈ విధంగా ఉపయోగిస్తే ఎముకల ప్రతిష్టవానికి బాగా ఉపయోగపడుతుంది