boost antibodies naturally

ఇవి ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి ఎక్కువవుతుంది……. ఇవి తినడం స్టార్ట్ చేయండి…

మన శరీరంలో వైరస్, బ్యాక్టీరియాలను బంధించి మన రక్షణ వ్యవస్థకు ఉపయోగపడే యాంటీ బాడీస్ ను తయారు చేసే మెకానిజం మనకు ఉంది. ఇటువంటి యాంటీ బాడీస్ ను బి సెల్స్ తయారు చేస్తూ ఉంటాయి. వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు కూడా మరొకసారి ఆ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవి రక్షిస్తాయి. ఇటువంటి ఆంటీ బాడీస్ ఉత్పత్తి చేసే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. అందులో ఒకటి ప్రోబయోటిక్స్. ఇవి పేగులో గుడ్ బ్యాక్టీరియాని పెంచుతాయి.

                     యానిమల్స్ సోర్స్ లో ఇవి పిండి పులియడం, పెరుగు పులియడం ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ప్లాంట్స్ సోర్స్ లో మాగిన పళ్ళల్లో ఎక్కువగా లభిస్తాయి. రెండవదిగా విటమిన్ సి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా పనికిరావడమే కాకుండా బోన్ మారో లో ఉండే డబ్ల్యూ బిసి యాక్టివేటింగ్ కి ఉపయోగపడుతుంది. విటమిన్ సి బాగా లభించాలి అంటే జామకాయలు బాగా తినాలి. అంతేకాకుండా నారింజ, కమలా జ్యూస్ లు కూడా తాగవచ్చు. మూడవదిగా విటమిన్ డి. ఇది బోన్ మారోను స్టీమ్యులేట్ చేస్తుంది.

                            ఎండ తగలకపోవడం వల్ల విటమిన్ డి లోపం వస్తుంది. దీన్ని సవరించుకోవడానికి విటమిన్ డి టాబ్లెట్స్ వాడవచ్చు. నాలుగోదిగా మన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి కావాలి అంటే ఫైబర్ కావాలి. ఈ ఫైబర్ రక్షణ వ్యవస్థను బూస్ట్ చేస్తుంది. ఫైబర్ షార్ట్ చైన్ యాసిడ్స్ బ్రేక్ డౌన్ చేస్తుంది. దీని ద్వారా రక్షణ వ్యవస్థ బాగా ఉత్సాహంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బీ సెల్స్ యాక్టివేషన్ కు కూడా బాగా మంచిది. ఐదవది అతి ముఖ్యమైన అవసరం ప్రోటీన్స్. యాంటీ బాడీస్ అన్ని ప్రోటీన్స్ నిర్మాణము కలిగి ఉంటాయి. వీటితో తయారయ్యవే ఆంటీ బాడీస్.

                             ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే పుచ్చ గింజలు, సోయా చిక్కుడు, మిల్ మేకర్, మొలకలు, వేరుశనగ పప్పులు. కాబట్టి ప్రోటీన్ అందాలి అంటే ఇలాంటి ఆహారం ముఖ్యంగా తీసుకోవాలి. ఆరోవదిగా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా కావాలి. యాంటీ ఆక్సిడెంట్ అంటే విటమిన్ ఏ, సి, డి, ఇ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే వైరస్ బ్యాక్టీరియా వేస్ట్ క్లీన్ చేయించడానికి సహాయపడతాయి. ఇప్పుడు చెప్పిన ఆహారాలు మనం తీసుకోవడం ద్వారా శరీరం కావాల్సిన యాంటీ బాడీస్ పుష్కలంగా లభిస్తాయి..

Leave a Comment

error: Content is protected !!