bottle gourd juice side effects

మంచిదే కదా అని తెగ తాగేస్తున్నారు…….. దీనివలన పేగులలో బ్లీడింగ్ మరియు లివర్ కుళ్ళిపోవడం ఖాయం….

మనం ఎక్కువగా ఉపయోగించే సొరకాయలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల సొరకాయలో 14 గ్రాముల క్యాలరీల శక్తి మాత్రం ఉంటుంది. అందువలన దీనిని జీరో క్యాలరీస్ కింద భావించి దీన్ని జ్యూస్ ఎక్కువగా తాగితే క్యాలరీస్ లభించవు మరియు షుగర్ పెరగకుండా ఉంటుంది అని, బరువు తగ్గుతామని రోజు ఉదయం పచ్చి సొరకాయ జ్యూస్ ను తాగుతూ ఉంటున్నారు. సొరకాయను పచ్చిగా వాడుకున్నప్పుడు ఇందులో ఒక హాని కలిగించే కెమికల్ మన పొట్టలోకి వెళ్తుంది. దానిని టెట్రాసైకిలీక్ ట్రై టర్పీనాయిడ్స్ అంటారు.

దీనినే మరొక రూపంలో కుక్కుర్బీటాసిన్స్ అంటారు. ఇది సొరకాయను పచ్చిగా లేదా జూసుల రూపంలో వాడినప్పుడు 250మి.లీ. పచ్చి సొరకాయ జ్యూస్ అలా తాగేస్తే ఇది డైరెక్ట్ గా వెళ్లి లివర్ ను డామేజ్ చేస్తున్నాయి. అదే పచ్చి సొరకాయ జ్యూస్ ను 350మి.లీ. లేదా అంతకంటే ఎక్కువ త్రాగినప్పుడు పేగులలో కూడా కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన ఇది మంచిది కాదు. 250 ml కు లివర్ 300 ml కు పేగులకు ఇటువంటి ప్రమాదం కలుగుతుంది అని సైంటిఫిక్ గా నిరూపించబడింది.

ఇలా నిరూపించిన వారు 2015 సం.లో. పరాస్ హాస్పిటల్ గుర్గన్, హర్యానా, ఇండియా వారు నిరూపించారు. కొంతమంది అరుదుగా సొరకాయ జ్యూస్ తాగి చనిపోయారు అని అపోహ ఉంది. కానీ దీని వలన చనిపోరు. ఇది మంచిదే కానీ వెజిటేబుల్ జ్యూస్ కాంబినేషన్లో కొంచెం మోతాదులో ఉపయోగిస్తే ఎటువంటి నష్టం ఉండదు అని వీరు క్లియర్ గా ఇచ్చారు. వారు కొంతమందికి 250 ml ఇచ్చి చూశారు మరి కొంతమందికి 300 ml ఇచ్చి చూశారు. ఎక్కువ మోతాదులో తాగితే ఈ విధంగా జరుగుతుంది అని వారు నిరూపించారు.

కనుక మీరు ఆలోచించి ఇటువంటి వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. మనకు చౌకగా దొరుకుతుంది అని లేదా మన పెరట్లో దొరుకుతుంది అని ఎక్కువగా ఉపయోగిస్తే అది మన ఆరోగ్యానికి నష్టం కలుగజేస్తుంది. దీనికి బదులు బూడిద గుమ్మడికాయ జ్యూస్ను తాగితే దాని వలన ఎటువంటి నష్టం ఉండదు. కానీ పచ్చి సొరకాయ జ్యూస్ మాత్రం తక్కువ మోతాదులో ఉపయోగించి తాగితే ఎటువంటి నష్టం ఉండదు…

Leave a Comment

error: Content is protected !!