ఉదయాన్నే మొలకలు తినలేని వాళ్ళు కొత్తగా స్ప్రౌట్స్ తో ఇడ్లీ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ స్ప్రౌట్స్ ఇడ్లీగా చేసుకుని తినడం వల్ల పోషకాలు పూర్తిగా వెళ్ళవు కానీ రోజు ఇలా పచ్చివే తింటే కొంచెం ఇష్టంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ చేసుకొని తినొచ్చు. ఈ స్ప్రౌట్స్ ఇడ్లీ ఎలా చేయాలంటే కావలసిన పదార్థాలు మొలకెత్తిన శనగలు అరకప్పు, మొలకెత్తిన పెసలు అరకప్పు, ఓట్స్ అర కప్పు, పెరుగు అర కప్పు, అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి మూడు తీసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్లో మొలకెత్తిన శనగలు, పెసలు వేసి పచ్చిమిరపకాయ ముక్కలు ఓట్స్ పెరుగు అల్లం ముక్కలు వేసి మెత్తగా ఇడ్లీ పిండిలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
దీనిని ఒక బౌల్ లోకి తీసుకుని కొద్దిగా వంట సోడా కలుపుకోవాలి. ఇలా కలిపితే ఇడ్లీ మెత్తగా వస్తాయి. ఇడ్లీ పాత్రలో మీగడ రాసేసి ఈ ఇడ్లీ పిండితో ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీ ఆవిడలో ఉడికిన తర్వాత తీసేయాలి. సాధారణంగా చిన్నపిల్లలకు బియ్యపు రవ్వ ఇడ్లీకి బదులు ఈ స్ప్రౌట్స్ ఇడ్లీ పెడితే చాలా పీచు పదార్థాలు, పోషకాలు అందుతాయి. ఇంట్లో పెద్దవారు కూడా మొలకెత్తిన విత్తనాలు తినలేనప్పుడు ఇలా ఇడ్లీ చేసి పెడితే చాలా లాభాలు ఉంటాయి. ఈ మొలకలు తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అనుకుంటే ఇలా ఇడ్లీ చేసుకొని తింటే కొంతవరకు గ్యాస్ ట్రబుల్ ని తగ్గించవచ్చు. ఆవిరిలో ఇడ్లీని మెత్తగా ఉడికించుకోవాలి.
తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళు, రెండు పచ్చిమిర్చి, ఖర్జూరపు మొక్కలు కొద్దిగా, ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుము, కొద్దిగా పెరుగు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేస్తే సింపుల్గా కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది. కావలసినవారు దీనికి మేగడవేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవచ్చు. ఇలా రోజు ఇడ్లీ వేసుకుని తినకూడదు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు టైం లేనప్పుడు తింటూ ఉండాలి. ఈ మొలకలను ఫ్రెష్ గా తింటేనే పోషకాలు శరీరంలోకి వెళ్తాయి. ఇలా తింటే అంత మంచిది కాదు కానీ కొంచెం వెరైటీగా ట్రై చేయాలి అనుకుంటే ఇలా చేసుకుని తినొచ్చు.
ఇలా ఇడ్లీ వేసుకుని తినడం వల్ల చిన్న పిల్లలు పెద్దవాళ్లు ఎవరైనా చాలా చక్కగా తినేస్తారు.