buckwheat benefits for skin

దీని ముందు గోధుమలు కూడా పనికిరావు……………… ఒంట్లో ఉన్న వేడిని కూడా ఇట్టే తగ్గించేస్తుంది…

గోధుమలు అన్నం కింద తిన్న లేదా గోధుమ పుల్కాలు చేసి ఎక్కువగా తిన్న దాంట్లో గ్లూటీన్ ఉంటుంది అని, అలాగే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన చాలామందికి షుగర్ పెరుగుతుంది అని, బరువు పెరుగుతుంది అని భయం వచ్చి చాలామంది గోధుమలు వాడడం తగ్గించేశారు. కొంతమంది అయితే పూర్తిగా మానేశారు. గోధుమలు కానీ గోధుమలు. గోధుమలకు ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి ఉపయోగపడే బక్ వీట్. ఇవి కేజీ 120 నుంచి 140రూ. వరకు సుమారుగా ఉంటాయి.

                      ఈ గోధుమలకు ప్రత్యేకత ఉంది. వీటిని గోధుమల వలె పుల్కాలు చేసుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, రవ్వగా చేసుకొని ఉప్మా కింది కూడా చేసుకోవచ్చు. ఇలాంటి గోధుమలను ఉపయోగించడం వలన టైప్ టు డయాబెటిస్ పెద్దలకు వచ్చే షుగర్ రాకుండా ఉంటుంది అని చాలా క్లియర్ ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. 2013 లో యూనివర్సిటీ ఆఫ్ టోపియో జపాన్ వారు ఈ బక్ వీట్ గురించి పరిశోధనలు చేశారు. ఈ బక్ వీట్ లో టైప్ టు డయాబెటిస్ ఇన్సూలీన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి ఏముంది అంటున్నారు అంటే డీ చీరో ఇనోస్టీల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉండటం వలన రక్తంలో లోపలికి వెళ్ళిన గ్లూకోస్ ని అక్కడి నుంచి కణాలకు ఎక్కువగా పంప్ చేస్తుంది.

                            కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది. కాబట్టి టైప్ టు డయాబెటిస్ రాకుండా ఇన్సులిన్ రెసిస్టేన్స్ ఒబేసిటీ వలన ఎక్కువ మందికి వస్తుంది. దానిని రాకుండా చేసుకోవడానికి గోధుమలకు ప్రత్యామ్నాయంగా బక్ వీట్ వాడుకుంటే చాలా బాగుంటుంది అని సైంటిస్టులు తెలియజేయడం జరిగింది. బక్ వీట్ తీసుకొని హోల్ బక్ వీట్ మనం పిండి పట్టించి రెండు పుల్కాలు లాగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా మల్టీ గ్రెన్ కాంబినేషన్లో కూడా ఇతర ధాన్యాలతో ఈ బక్ వీట్ ను కూడా మన కాంబినేషన్ ఇచ్చి వాడుకోవచ్చు.

                      కొంతమందికి పుల్కాలు పడవని, మోషన్ లో బ్లడ్ పడుతుంది అని, వేడి చేసి తలనొప్పి వస్తుంది అనే వారికి ఈ బక్ వీట్ పుల్కాలు చేసుకోవచ్చు. ఎంతో కొంత జిగురు ఉంటే గాని ఇవి పుల్కాల కింద రావు కానీ వీటిని ఏదో ఒక దాంట్లో కాంబినేషన్స్ లో ఉపయోగించుకోవచ్చు. కనుక ఈ రోజుల్లో ఇలాంటివి మీకు అందుబాటులో లభిస్తున్నాయి కాబట్టి వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు…

Leave a Comment

error: Content is protected !!