budamkaya health benefits

ఈ కాయలు ఎక్కడైనా కనిపిస్తే ఎవరికీ చెప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఎన్ని లక్షలు ఖర్చుపెట్టినా తగ్గని రోగాలను నయం చేస్తాయి

బుడమ కాయ, కుప్పింట కాయ, బుడ్డకాయ అని పిలవబడే ఈ మొక్క మన చుట్టుపక్కల పెరుగుతుంది. మనం దీనినివపిచ్చి మొక్కగా భావించి పట్టించుకోం, పీకిపారేస్తూ ఉంటాం. కానీ సీజనల్గా వచ్చే ఈ  చెట్టు పండ్లలో అనేక ఆయుర్వేద  ఔషధ గుణాలు ఉంటాయి. ఇంతకుముందు కాలంలో చిన్నప్పుడు పిల్లలు వీటిని సరదాగా తింటూ ఉండేవారు. ఇవి తీపి, పులుపు కలిసిన ఒక విచిత్రమైన రుచిలో ఉంటూ వీటిని తిన్నపుడు అనేక ఔషధ గుణాలను, విటమిన్లను మనకు తెలియకుండానే మనకు అందిస్తాయి.

 పైన సన్నటి పొరలాంటి పచ్చని కవచంతో ఉండి లోపల చిన్న పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా, పండినప్పుడు టమాటా రంగులో చిన్న విత్తనాలతో ఉంటాయి. చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య ఉన్నపుడు ఈ పండ్లను తినిపించడం వల్ల నులిపురుగులు పోతాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఈ పండ్లు తినడం వలన మలబద్ధకం సమస్య నివారించేందుకు సహాయపడుతుంది.

ఈ పండ్లలో అనేక రకమైన విటమిన్లు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో దసరా రోజున ఈ పండ్లను అమ్మవారి దగ్గర  ప్రసాదంగా పెట్టి తర్వాత తింటుంటారు. ఇందులో ఉండే విటమిన్లు శరీరంలో క్యాన్సర్ కణాలు నశింపజేస్తాయి అని కూడా నమ్ముతారు. ఈ చెట్టు ఆకులలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఆదిలాబాద్కు చెందిన కొంతమంది గిరిజనులు ఈ ఆకులను ఇష్టంగా ఆకుకూరలా వండుకొని తింటారు. విటమిన్ ఏ అదికంగా ఉండే ఈ ఆకులను కూరగా తినడం వలన కంటిసమస్యలు తగ్గిపోతాయి. 

డయాబెటిస్ సమస్య ఎక్కువగా ఉన్నవారు ఈ చెట్టు వేరును తెచ్చి కషాయం చేసుకొని తాగడం వలన షుగర్ అదుపులోకి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఒంటి నొప్పులు అధికంగా ఉన్నవారు ఈ ఆకులను తెచ్చి మెత్తగా నూరి నొప్పులున్న చోట కట్టడం వలన నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ కాయలు తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడి ఎటువంటి వైరస్లు బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్లు దరిచేరవు. అలాగే మూత్రపిండాలు, లివర్ శుభ్రపరచడంలో ఈ కాయలు చాలా బాగా సహాయపడుతాయి.

Leave a Comment

error: Content is protected !!