బుడమ కాయ మన చుట్టుపక్కల ఉండే ఈ మొక్కను మనం పిచ్చి మొక్కగా భావించి పట్టించుకోం. కానీ సీజనల్‌గా వచ్చే ఈ పండ్లలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. చిన్నప్పుడు పిల్లలు వీటిని సరదాగా తింటూ ఉండేవారు ఇవి తీపి పులుపు కలిసిన ఒక విచిత్రమైన రుచిలో అనేక ఔషధ గుణాలను, విటమిన్లను మనకు తెలియకుండానే మనకు అందించేవి. పైన సన్నటి పొరలాంటి కవచం ఉంటే లోపల చిన్న పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా, పండినప్పుడు టమాటా రంగులో ఉంటాయి. చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య ఉన్నవారు ఈ పండ్లను తినిపించడం వల్ల పురుగులు పోతాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఈ పండ్లు తినడం వలన మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
ఇందులో అనేక రకమైన విటమిన్లు ఉంటాయి. దసరా రోజున ఈ పండ్లను అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత తింటుంటారు. ఇందులో ఉండే విటమిన్లు శరీరంలో క్యాన్సర్ కణాలు నశింపజేస్తాయి అని నమ్ముతారు. ఈ ఆకులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఆదిలాబాద్‌కు చెందిన గిరిజనులు ఈ ఆకులను ఇష్టంగా వండుకొని తింటారు. విటమిన్ ఏ అధికారులు కంగా ఉండే ఈ ఆకులను కూరగా తినడం వలన కళ్ళు మసకగా కనిపించడం, కంటిశుక్లం, దృష్టి తగ్గడం, కంటి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. షుగర్ సమస్య ఎక్కువగా ఉన్న వారు ఈ చెట్టు యొక్క వేరును తెచ్చి కషాయం చేసుకొని తాగడం వలన షుగర్ అదుపులోకి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కాళ్ల నొప్పులు అధికంగా ఉన్నవారు ఈ ఆకులను తెచ్చి మెత్తగా నూరి నొప్పులున్నచోట కట్టడం వలన నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.
శరీరంలో సెగ్గడ్డలు సమస్య ఎక్కువగా ఉన్నవారు ఈ ఆకులను నువ్వుల నూనెను రాసి వేడి చేసి కడితే త్వరగా తగ్గిపోతాయి. చిన్న పిల్లలకు కడుపు నొప్పి వస్తుంటే ఈ ఆకులను నూరి పొట్టపై పట్టు వేయడం వల్ల కడుపునొప్పి తగ్గుతుంది. పొలాల్లో పనిచేసేవారికి గాయాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కాయలను తెచ్చి వాటినుండి వచ్చే పసరు గాయాలపై వేయడం వలన రక్తస్రావం తగ్గి గాయాలు త్వరగా మానిపోతాయి. ఈ కాయలను తినడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. గుండె, మూత్రపిండాలకు బలం చేకూరుస్తుంది. ఈ చెట్టును బుడమ చెట్టు, బుడ్డ కాయ, అడవి టమాటా వంటి పేర్లతో పిలుస్తారు. ఈ మొక్కలు మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తింటుంటారు. కొన్ని దేశాలలో బాక్స్‌లో పెట్టి అమ్ముతారు.
ఈ చెట్టు ఆసాంతం ఔషధగుణాలతో నిండి ఉంది. ఈ చెట్టులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బలంగా చేయడంలో సహాయపడుతుంది. యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. యాంటీబాక్టీరియల్ గుణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఈ మొక్క యొక్క సారాన్ని అప్లై చేయడం వలన తలనొప్పి తగ్గుతుంది. చర్మ సమస్యలు ఉన్నవారు దీన్ని అప్లై చేయడం వలన చర్మ సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల రసాన్ని నువ్వుల నూనెతో కలిపి గోరువెచ్చగా చేసి వేరడం వలన చెవిలో నొప్పి తగ్గుతుంది. ఈ వేరు యొక్క కషాయాన్ని తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది.