Burning sensation in feet Causes & Remedies

అరికాళ్ళు అరచేతులు మంటలు పెడుతున్నాయా??అయితే ఇది చదవాల్సిందే

అమితంగా వేడి చేసినపుడు, వేడి చేసి ఆహారపదార్థాలు ఎక్కువగా తిన్నపుడు, వేడి చేసి స్వభావం ఉన్న మందులు వాడినప్పుడు అరచేతుల్లో భగభగ మంటూ మంటలు పుడతాయి. షుగర్ వ్యాధిలోనూ, బిపి వ్యాధిలోనూ వేడి చేసి స్వభావం ఉన్న వ్యక్తులకు అరికాళ్ళు, అరచేతుల్లో మంటలు పుడుతుంటాయ్. కారణం మందుల ప్రభావం.  వేడి చేసి వారిలో ఈ అరికాళ్ళు, అరచేతి మంటలు ఎక్కువగా ఉంటాయి.  అయితే  వేడి చేసి కొన్ని పదార్థాలు తినడం వల్ల పుట్టే వేడి, అదే పదార్థాలను బాహ్యంగా వాడటం వల్ల  ఉపశమనాన్ని ఇస్తుంటాయి అవేంటో ఒకసారి చూద్దాం.

◆ ఎర్రని గుమ్మడి కాయను చాలామంది ఇష్టంగా తింటారు.  దీన్ని ఆహారంగా తీసుకుంటే వేడి, మంటలు, పోట్లు పెరుగుతాయి. కానీ ఈ ఎర్రని గుమ్మడికాయ గుజ్జుని మెత్తగా చేసి అరికాళ్ళు మరియు అరచేతులకు  పట్టిస్తే మంటలు తగ్గి చలువను చేస్తాయి.

◆ రేగు చెట్టు గూర్చి ఎవరికి తెలియదు. దాంతో మనది చాలా గొప్ప జ్ఞాపకం. బాల్యమంతా రేగుచెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి రేగు చెట్టు ఆకుల్ని మెత్తగా దంచి పెరుగులో కలిపి చల్లకవ్వం తో బాగా చిలకాలి.  అలా చిలికినపుడు చిక్కటి వెన్న నురుగు వస్తుంది. ఈ వెన్న నురుగును అరికాళ్ళు మరియు అరచేతులకు రాసుకుంటే మంటల నుండి ఉపశమనం ఉంటుంది.

◆ చల్లదనానికి గొప్ప చిహ్నం గంధం. గంధపు చెక్కను గంధపు రాయి మీద  అరగదీసి అందులో ఒక చిన్న ముక్క పచ్చ కర్పూరం వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని అరచేతులకు మరియు అరికాళ్లకు రాసుకుంటే చలువ చేసి మంటలు తగ్గిపోతాయి.

◆ సాధారణంగా గ్రామాల్లో పశు సంపద ఎక్కువ. అప్పటికప్పుడు పాలు పితికితే వాటిలో మంటలను తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. అప్పుడే పితికిన ఇంకా వెచ్చదనం తగ్గని పాలను వేడిచేయకుండా పచ్చివే తాగాలి. ఇది శరీరంలో అమిత వేడిని అణిచివేస్తుంది. 

◆ వేడి చేసె పదార్థాలను తినడం మానుకోవాలి. చలువ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు, పలుచని మజ్జిగ, నిమ్మరసం కలిపిన నీళ్లు వంటివి వేడి తగ్గించడం లో ఉత్తమంగా పనిచేస్తాయి.

◆ తాజా పండ్లు, పళ్లరసాలు. ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా కలిగి ఉండి శరీర తాపాన్ని తగ్గించగల పుచ్చకాయ, కర్భుజ, కీరదోస వంటివి తీసుకోవడం వల్ల అతి వేడిని తరిమేయవచ్చు.

చివరగా…….

శరీరంలో వేడి చేయడం అనేది త్రిగుణాలైన వాత, పిత్త, కఫ దోషాల అసమతుల్యత వల్ల సంభవించేది కాబట్టి ఈ మూడు గుణాలను శరీరంలో సమతా స్థితిలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

Leave a Comment

error: Content is protected !!