Calcium and Protein Rich Foods Improves Strength

పుట్టిన బిడ్డకు కాల్షియం మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తల్లిపాల నుండి ఎలా లభిస్తాయి…

తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డకు తల్లి పాలే మ్యాచింగ్. ఈ పాలు బిడ్డ తాగడం వల్ల బిడ్డకు కావలసిన యాంటీబాడీస్ తయారవుతాయి. బిడ్డకు కావలసిన లింఫోసైట్స్ తల్లిపాల నుండే లభిస్తాయి. ఇక బిడ్డకు కావలసిన పోషకాలని ఐరన్, కాల్షియం, లవణాలు, ప్రోటీన్ మొదలైనవి బిడ్డకు ఆహారంగా తల్లిపాల నుండే వస్తాయి. కాబట్టి తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం ఎంతో శ్రేష్టం. తల్లి పాలల్లో 87% నీళ్లు ఒక గ్రామ్ ప్రోటీన్ మూడు నుండి నాలుగున్నర కొవ్వు ఉంటుంది. 70 -75 క్యాలరీలు శక్తి లభిస్తుంది. తల్లికి పాలు అనేవి బిడ్డ పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతాయి. తల్లి పాలల్లో ముందుగా తయారయ్యేది కొలెస్టమ్ అనే జిగురు లాంటి పదార్థం.

                   ఇది గోధుమ వర్ణంలో ఉండే ఫ్లూయిడ్ గా తయారవుతుంది. అది నాలుగైదు నెలలు వచ్చి నెలలు ఉండే వరకు తయారవుతాయి. బిడ్డ పుట్టిన తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజోస్టిరన్ హార్మోన్స్ తగ్గుతాయి. ఇవి తగ్గిపోతే మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంధి కి వెళ్లిపోతాయి. అవి ప్రో లాక్టిన్ అనే హార్మోన్ నీ రిలీజ్ చేస్తాయి. అది రిలీజ్ అయిన వెంటనే తల్లి స్థానాల్లో పాలు తయారవడం జరుగుతుంది. మొదటి రెండు రోజుల్లో తల్లి పాలన చాలా ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉంటాయి. వీటిని మురిపాలు అని అంటారు. కాబట్టి రెండు రోజుల్లో తల్లి పాలను బిడ్డకు తప్పనిసరిగా పట్టించాలి. దాదాపు బిడ్డకు అన్ని పనులు వచ్చేంతవరకు ఈ పాలన ఇవ్వాలి. ఈ పాలు తాగడం ద్వారా బిడ్డ లావు కాకుండా భవిష్యత్తులో షుగర్ వ్యాధి లాంటివి రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

                    ఈ పాలన బిడ్డకు రెండు సంవత్సరాల పాటు ఇవ్వడం వల్ల ఆ బిడ్డ జీవితకాలం పాటు ఆరోగ్యంగా ఉంటాడు. ఇంత విలువైన ఆహారం నేచర్ లో ఎక్కడా దొరకనిది ఒక్క అమ్మ దగ్గరే దొరుకుతుంది. ఈ రెండు సంవత్సరాల పాటు తల్లికి పుష్కలంగా పాలు రావాలి అంటే హై ప్రోటీన్ డైట్ ని ఎక్కువగా తీసుకోవాలి. పాలిష్ పట్టించని బియ్యం, కొరలు తినాలి. ఆకుకూరలు కందిపప్పు, పెసరపప్పు ఎక్కువ తినాలి. భోజనం చేసిన తర్వాత ఒక నవ్వులో ఉండా తినాలి. ఇలా రెండు సంవత్సరాలు తినడమే పనిగా, పాలు ఇవ్వడం పనిగా పెట్టుకోవాలి. ఇలా ఆహార నియమాలు పాటిస్తే బిడ్డకు పుష్కలంగా పాలు అందుతాయి.

Leave a Comment

error: Content is protected !!