Calcium deficiency symptoms in plants

కేవలం మూడు సార్లు తీసుకోండి…. 100 ఏళ్ళు వచ్చినా క్యాల్షియం లోపం ఉండదు…… కాళ్లు, నడుము నొప్పి ఉండదు. నిద్రలేమి, అలసట, నీరసం పూర్తిగా మాయం

          కేవలం వారానికి మూడు సార్లు తీసుకుంటే చాలు. నడుము నొప్పి, కాళ్లు నొప్పి, మోకాళ్ళ నొప్పి మీ శరీరంలో ఎటువంటి జాయింట్ పెయిన్ అయినా తగ్గుతుంది. ప్రస్తుత కాలంలో ఏ వయస్సు వారైనా కీలు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం  మన శరీరంలో క్యాల్షియం లోపం. ఇలాంటి వాటికి ఉపయోగపడే ఒక ఆయుర్వేద రెమిడి నీ ఈరోజు తెలుసుకుందాం. ఈ రెమిడి నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికోసం మనం ముందుగా గసగసాలు తీసుకుందాం. గసగసాలను ఉపయోగించి ఏ వంటకం చేసినా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ముఖ్యంగా మన శరీరంలోని ఎన్నో జబ్బులను న్యాయం చేస్తుంది. ఇందులో క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. రెండవదిగా మనకు కావాల్సిన పదార్థం సోంపు. ఈ సోంపు అజీర్ణం నుండి విడుదల కలిగిస్తుంది. అంతేకాకుండా కంటిచూపును మెరుగుపరుస్తుంది. మరియు అధిక కొవ్వు ఉన్న వాళ్లకి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మూడవదిగా ఎండుకొబ్బరి. కొబ్బరిలో క్యాల్షియం మరియు అనేక పోషక విలువలు కలిగి ఉంటుంది. మరియు శక్తిని అందిస్తుంది.

నాలుగవదిగా పటిక బెల్లం. పటిక బెల్లం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరియు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇంకా శరీరాన్ని చల్ల పరుస్తుంది. దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ రెమిడినీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టి దానిలో రెండు స్పూన్ల నేయ్యి ను వేడి చేసి అందులో రెండు స్పూన్ల గసగసాలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలను వేసి మరగనివ్వాలి. అందులో ఒక అంగుళం ఎండు కొబ్బరిని వేసి మరగనివ్వాలి.ఆ తర్వాత ఒక స్పూన్ సొంపు వేసి ఒక పొంగు వచ్చాక పటిక బెల్లం వేసి బాగా మరిగించాలి.

ఇలా తయారైన పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఈ పాలను రోజు తప్పించి రోజు వారానికి 3 సార్లు తీసుకోవాలి. మరియు ఇవి రాత్రి పడుకోబోయే 10 నిమిషాల ముందు ఒక గ్లాసు పాలను తీసుకోవడం మంచిది…ఈ పాలను తీసుకోవడం వల్ల కాల్షియంలోపం నుండి విడుదల పొందవచ్చు. మరియు ‌ వెన్నునొప్పి కాళ్ల నొప్పి నడుము నొప్పి నుంచి విడుదల పొందవచ్చు…

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!