Calcium Rich Foods Improves Bones Strength

కాల్షియం కి కేరాఫ్ అడ్రస్ ఇది!……

గేదె పాలు ఆవు పాలు అని రెండు రకాలుగా మనకు తాగడానికి ఉన్నాయి. సాధారణంగా పాల ద్వారా ఎక్కువగా ప్రోటీన్ వస్తుంది అని చెప్తారు. మామూలుగా 100 గ్రాముల గేదెపాలు బాగా చిక్కనివి తీసుకుంటే 4.3 గ్రాములు మాంసకృత్తులు ఉంటాయి. అదే ఆవుపాలలో 3.2 గ్రాములు మాంసకృత్తులు ఉంటాయి. అలాగే క్రొవ్వులు అనేవి 6.5 గ్రాములు గేదె పాలల్లో ఉంటే, ఆవు పాలల్లో 4.5 గ్రాములు ఉంటాయి. చిక్కని గేదె పాలు తాగితే 117 క్యాలరీల శక్తి వస్తుంది మరి ఆవుపాలలో అయితే 67 క్యాలరీల శక్తి వస్తుంది. అలాంటి కాల్షియం చిక్కటి పాలల్లో 110 మిల్లీగ్రాములు ఉంటుంది. ఆవు పాలలో అయితే 120 మిల్లి గ్రాములు ఉంటుంది.

                    పూర్వం రోజుల్లో పశువులు లేని ఇల్లు ఉండేది కాదు, పాలు ఎవరు కొనుక్కునేవారు కాదు చిక్కటి పాలు తాగేవారు. కాబట్టి వాళ్లకి పోషకాలు అన్ని అందేవి. మరి ఈ రోజుల్లో మనం తాగే గేదె పాలు చిక్కనివి కాదు నీళ్లు కలిపి అమ్ముతున్నారు. కానీ శ్రేష్టమైతే ఆరోగ్యానికి ఆవు పాలే మంచిది. అందరూ కోరుకునేది పాల నుండి ప్రోటీన్ మరియు కాల్షియం. పిల్లలకి ప్రోటీన్ అనేది ఒక కేజీ బరువుకి రెండు గ్రాములు చొప్పున ప్రోటీన్ కావాలి. పెద్దవాళ్లకి ఒక గ్రామ్ ప్రోటీన్ చాలు. కాల్షియం అనేది పెద్దలకి 450 mlg సరిపోతుంది, వయసులో ఉన్న పిల్లలకైతే 600 mlg కాల్షియం కావాలి. మరి ఇంత కాలుష్యం కావాలంటే పొద్దున సాయంత్రం పాలు తాగాలి.

                 ఒక్కొక్క బిడ్డకి కాల్షియం కోసం పాలు తాగిస్తే రోజుకి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. అసలు మనం తాగేది పాలు కాదో కూడా తెలియదు ఎందుకు అంటే రకరకాల యూరియా సర్ఫ్ షాంపులు ఇవన్నీ కలిపి కృత్రిమంగా పాలు తయారు చేస్తున్నారు. ఇలా కల్తీ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈరోజుల్లో పాలు తాగడం కంటే క్యాల్షియం కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అలాంటి ఆహారాలు ఆకుకూరలు ఎక్కువగా పెట్టాలి. తోటకూర పొన్నగంటి కూర, మునగాకు, మెంతికూర ఇవన్నీ పాల కంటే 3 టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉండే ఆహారం. ఒక్క నువ్వుల ఉండ తీసుకుంటే పాలకంటే ఎక్కువ పదమూడు రేట్లు కాల్షియం వస్తుంది.

                     కాబట్టి ఇలాంటి చక్కటి ఆహారాలు ప్రకృతిలో లభిస్తున్నప్పుడు పాలు తాగాల్సిన అవసరమే ఉండదు.

Leave a Comment

error: Content is protected !!