Calcium Rich Recipe Curry Leaves Millet Rice

విటమిన్ ఏ రిచ్ రైస్…… కంటి చూపుని పెంచుతాయి……… కరివేపాకు మిల్లెట్ రైస్…

సాధారణంగా మిల్లెట్ రైస్ అంటేనే చాలా ఆరోగ్యకరం. అలాంటి మిల్లెట్ రైస్కు కరివేపాకును కూడా జోడించి తయారు చేసుకుంటే ఇంకా ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణంగా కరివేపాకు అంటేనే కేవలం సువాసన కోసం మాత్రమే అన్నట్టు ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా చూస్తే 100 గ్రాముల కరివేపాకులో 730 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అంటే పాలకంటే 7వంతులు ఎక్కువ కాల్షియం కరివేపాకులో ఉంటుంది. అలాంటి కరివేపాకును ఎక్కువ ఉపయోగించి వాడుకునే పద్ధతే ఈ కరివేపాకు మిల్లెట్‌ రైస్.

                            మామూలుగా వండుకునే రైస్ లో పోషకాలు ఉండవు, యాంటీ ఆక్సిడెంట్స్, బి కాంప్లెక్స్ లు విటమిన్స్ ఉండవు. మిల్లెట్స్ లో ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. కరివేపాకు అన్నిటికంటే ఎక్కువగా విటమిన్ ఏ బాగా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మరియు లవణాలు కూడా ఎక్కువే. కానీ కరివేపాకుని ఏరిపడివేయడం లాగా అయిపోయింది. ఈ కరివేపాకు మిల్లెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు వన్ అండ్ హాఫ్ కప్ కరివేపాకు.

                             నానబెట్టిన కొర్రలు ఒక కప్పు, ఒక కప్పు కొబ్బరి పాలు, వేరుశనగ పప్పులు ఒక హాఫ్ కప్పు, పచ్చిమిర్చి ఐదారు, కందిపప్పు రెండు టేబుల్ స్పూన్, మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు, శనగపప్పు రెండు స్పూన్లు, ధనియాలు ఒక స్పూన్, జీలకర్ర టీ స్పూన్, నిమ్మరసం ఒక స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, మిగడ రెండు టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి మూడు. ముందుగా నానబెట్టిన కొర్రలను ఒక కడాయిలో వేసుకొని అందులో కప్పు కొబ్బరి పాలు, ఒక కప్పు నీటిని వేసి రైస్ మాదిరిగా ఉడకబెట్టుకోవాలి.

                           ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో కందిపప్పు, పచ్చనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి వేగనివ్వాలి. వీటిని పక్కన పెట్టి తర్వాత అందులో ఎండు మిరపకాయలు, వేరుశనగపప్పు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకును కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటినీ బాగా మెత్తని పొడి లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి ఒక మిగడ వేసి వేగనివ్వాలి. ఇందులో ముందుగా ఉడకపెట్టిన కొర్రల అన్నాన్ని వేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. 

       ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న కరివేపాకు పొడి కూడా వేసుకోవాలి. దీనిపైన వేరుశనగపప్పు కొత్తిమీర వేసి డ్రెస్సింగ్ చేసుకోవాలి. కరివేపాకు కొర్రలు అన్నం రెడీ అయిపోతుంది

Leave a Comment

error: Content is protected !!