అరోగ్య శ్రేయోభిలషులఅందరికీ నమస్కారం.ఈ రోజు మనం నిత్యం వాడే అకుకూరలు గురించి వాటిలో ఉన్న పోషక విలువల గురించి, వాటిలో ఏ ఆకుకూరలలో ఎక్కువగా పోషక విలువలు నిల్వ ఉంటాయి. వాటి వలన ఏమైనా లాభమా? అన్న విషయాలను గురించి తెలుసుకుందాం.
ముఖ్యంగా మన ఆహారంలో పావలా శాతం అనగా అతి తక్కువ మోతాదులో ఆకుకూరలను తింటాము కూరగాయలను ఎనభై శాతం తింటాము కావున, ఆకుకూరల నుండి ఎక్కువ శక్తి లభించదు. మనం వాడే ఆకుకూరలు ఎక్కువగా తోటకూర,పాల కూర,మెంతి కూర,చుక్క కూర,బచ్చలికూర, కొబ్బర కూర, గోంగూర వంటి వాటిని వాడుతుంటాము. చాలా అరుదుగా వాడే ఆకుకూరలు పొనగంటి ఆకు, మునగాకు,బచ్చలి కూర గోంగూర వీటిని వాడటం చాలా అరుదు.
మనం నిత్య జీవితంలో అత్యంత ప్రాధన్యతను ఇచ్చే వాటిలో ముఖ్యంగా పాలకూర తరువాత తోటకూర కు. ఎందుకనగా? వీటి ఆకులు పెద్దవి గా ఉంటాయి. అంతేకాకుండా పని తక్కువ.మెంతి కూర చుక్కకూర ను లేదా మునగ ఆకులను తియ్యడం చాలా పనితో కూడుకున్నది. అంతే కాకుండా గోంగూర ను వాడడం వలన అధిక వేడి చేస్తుందని దానిని వాడరు.
అన్ని ఆకుకూరల కంటే ఎక్కువగా తోటకూర లో చాలా పోషక విలువలు కలిగి వున్నాయి వాటిలోకాల్షియం,లవణాలు , సోడియం, విటమిన్స్ చాలా అధికంగా ఉంటాయి. ఈ తోటకూర లో ముఖ్యంగా, వంద గ్రాములు ఆకుకూరలలో నాలుగు వందల మిల్లీ గ్రాముల క్యాల్షియం లేదా ఐదువందల మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
అదే విధంగా,పాలకూరలో ఆక్సిలెట్ట్ అనే పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో లవణాలు కూడా అధికంగా ఉంటాయి. గోంగూర పులుపు కలిగి ఉంటుంది.అన్ని కూరలలో దీనిని కాస్త వేసుకోవడం వలన చాలా రుచికరంగా ఉండి మంచి ఆరోగ్యాన్ని యిస్తుంది.మెంతి కూర కాస్త చేదుగా ఉంటుంది.కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.దీనిని సన్నగా తరిగి పుల్క్కా పిండిలో వేసి తినవచ్చు లేదా దీనిని పప్పులో తినడం వలన మన శరీరానికి కావలసిన పోషక విలువలు అందుతాయి.
చుక్కకూర క్యారట్ కలిపి కూర వండడం వలన రుచి మరియు ఐరెన్ అధికంగా లభిస్తుంది.విటమిన్ ఎ అధికంగా ఉన్న ఆకుకూరల్లో ముఖ్యంగా మునగాకు. పొన్నగంటి ఆకులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది వంద గ్రాముల ఆకుకు ఐదు వందల మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. కాబట్టి ఒక్కో ఆకుకూరలలో ఒక్కో గుణం కలిగి ఉంటాయి.కాబట్టి మనం అన్ని ఆకుకూరలను ప్రతి రోజు తినడం వలన మన శరీరానికి అన్ని పోషక విలువలు చేరి మన శరీరానికి కావలసిన శక్తిని అందజేస్తాయి. మీరు తిని ,మీ పిల్లలకు తినిపించి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని విజ్ఞప్తి.