మీకు తెల్లగా ఉన్న జుట్టు నల్లగా అవ్వాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కలబంద తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఈ చిట్కాకి కావలసిన పదార్థాలు కొన్ని జామ ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి కలబంద ముక్కలు వేసుకున్న గిన్నెలో వేసుకుని కొన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి.ఒక పావుగంట ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని వడకట్టుకోవాలి. వడకట్టిన ఈ నీటిని చల్లారనివ్వాలి.
ముందు రోజు తలస్నానం చేసి తర్వాత రోజు తలకు నూనె లేకుండా ఈ నీటిని కుదుళ్ళ నుండి జుట్టు చివరివరకూ ఈ నీటిని రాసుకోవాలి. నెమ్మదిగా చేతులతో తలమొత్తం పట్టేలా మసాజ్ చేసుకోవాలి. ఒక గంట తర్వాత చల్లని నీటితో ఇలా వారానికి మూడు రోజులు చేయాలి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చొప్పున నెల రోజులు చేసినట్లైతే ఫలితం కనిపిస్తుంది. ఎంత తెల్ల జుట్టు అయినా నల్లగా మారక తప్పదు. ఇంత సింపుల్ చిట్కా ను ట్రై చేసి మీ జుట్టు నల్లగా మార్చుకోండి.
దీనిలో వేసే పదార్థాలన్ని ఈజీగా మీ ఇంటి పెరట్లో దొరికేవే కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు. ఈ నీటిని చిన్నపిల్లల్లో తెల్ల వెంట్రుకలు ఉన్న వారికి కూడా వాడొచ్చు ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు సంరక్షణలో కూడా కలబంద తోడ్పడుతుంది.. కలబంద ను కండీషనర్ లాగా కూడా ఉపయోగించవచ్చు.జామ ఆకుల్లో క్రోబియల్, యాంటీఆక్సిడెంట్ , యాంటి ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జెసిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి మాడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. విటమిన్ బి మరియు సి సమృద్ధిగా ఉన్నందున, ఇవి వెంట్రుకలకు అవసరమైన పోషణను అందించి, ఎదిగేట్టు చేస్తాయి. ఇవి జుట్టుకు మెరుపునిచ్చి, పరిమాణాన్ని పెంచుతాయి.
కలబంద మాడు పై ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది. వయసు అయిపోయిన వారు ఈ చిట్కా ట్రై చేయడం వలన వారి జుట్టు నల్లబడి వయసు తగ్గినట్లు కనిపిస్తారు. ఈ చిట్కా క్రమం తప్పకుండా పాటించినట్లయితే ఫలితం చూసి మేరే ఆశ్చర్య పోతారు. ఈ చిట్కాతో ఒక రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా మీ జుట్టుని నల్లగా చేసుకోవచ్చు. ఈ సింపుల్ చిట్కాని మీరు కూడా ట్రై చేయండి.