Can We Eat Papaya During Pregnancy

గర్భవతులు బొప్పాయి తింటే జరిగే పరిణామాలు మీరే చూడండి.

ఇంట్లో ఆడపిల్ల నెల తప్పిందనగానే ఇల్లంత కొత్త కళ సంతరించుకుంటుంది. అవి తిను ఇవి తిను అలా ఉండు ఇలా ఉండు లాంటి సలహాలు, సూచనలు,  జాగ్రత్తలు ఇవి మాత్రమే కాదు బోలెడు పోషకాలు  ఉన్న ఆహారాన్ని ఇవ్వడంలో కూడా ఇంటిల్లిపాది ముందుంటారు. అయితే చాలా మంది పెద్దవాళ్ళు గర్భవతులు తీసుకునే పళ్ళ జాబితా నుండి బొప్పాయిని దూరం జరిపేస్తారు. బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందనే పెద్దల మాట నిజమేనా అని ఆలోచిస్తే, మరియు నిజానిజాలను విశ్లేషిస్తే అది కేవలం అపోహ అనే విషయం తెలుస్తుంది.

అసలు బొప్పాయి తినకూడదని ఎందుకు చెబుతారు??

బొప్పాయి తినకూడదన్నది అపోహ అయితే గర్భవతులు గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు పచ్చి బొప్పాయికి దూరంగా ఉండాలి.  బొప్పాయిలో ఉన్న పపాయిస్ అనే ఎంజైము గర్భసంచి కుచించుకుని పోయేలా చేస్తుంది. దీనివల్ల గర్భస్రావం జరుతుంది. అందుకే మొదటి మూడు నెలలు పచ్చి బొప్పాయికి దూరంగా ఉండాలి.

అయితే పండిన బొప్పాయిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.  వీటి వల్ల గర్భవతుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బాగా పండిన బొప్పాయిని గర్హవతులు నిరభ్యరంతంగా తీసుకోవచ్చు. పండిన బొప్పాయిలో విటమిన్-సి, విటమిన్-ఇ, ఫోలిక్ యాసిడ్, పీచు పుష్కలంగా ఉంటాయి.  పీచు అధికంగా  ఉండటం వల్ల జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.  దీనివల్ల  గర్భవతుల్లో తలెత్తే మలబద్దకం సమస్య నివారించబడుతుంది. 

 పండిన బొప్పాయిని తీసుకోవడం వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎంతగానో దోహదం చేస్తుంది. కడుపులో బిడ్డ ఎముక ఆరోగ్యానికి చాలా ఉత్తమమైనది, మరియు కంటి చూపును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

గర్భవతులలో అనిమియా ఉన్నవారికి ఇది గొప్పగా తోడ్పడుతుంది. ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేసి హిమోగ్లోబిన్ ను గణనీయంగా పెంచుతుంది. 

గర్భవతులు ఏ రూపంలోనైన పండిన బొప్పాయిని తీసుకోవడం వల్ల బిడ్డకు తల్లికి అవసరమైన పోషకాలను పుష్కలంగా పొందగలరు. అయితే బొప్పాయిని తీసుకునేటప్పుడు విత్తనాలు తప్పనిసరిగా పూర్తిగా తొలగించుకోవాలి, అంతేకాదు బొప్పాయి మీద తొక్కను కూడా పూర్తిగా తొలగించిన తరువాతనే బొప్పాయి తీసుకోవడం ఉత్తమం.

గర్భం ధరించిన వారిలో షుగర్, బిపి ఉన్నట్లయితే తప్పనిసరిగా బొప్పాయిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చివరగా……

బొప్పాయి అనేది సాధారణ సమయం తో పాటు గర్భం దాల్చినపుడు కూడా నిస్సంకోచంగా తీసుకోవచ్చు. అయితే బాగా పండినదే సుమా!! దీనివల్ల ఆరోగ్యానికి అదనపు లాభాలే తప్ప  ఎలాంటి నష్టం కూడా ఉండదు. కాబట్టి గర్భవతులు బొప్పాయి రుచిని ఆస్వాదించవచ్చు.

గమనిక : ఈ వెబ్ సైట్ లో  పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు

Leave a Comment

error: Content is protected !!