ఇప్పటి కాలం అందరికీ వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఈ తెల్ల వెంట్రుకలు ఉండటం వలన బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి వాటిని దాచి పెట్టడం కోసం రకరకాల హెయిర్ కలర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కాని వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. నాచురల్ పద్ధతిలో తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చే పద్ధతి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనం ముందుగా స్టవ్ మీద ఒక 2 గ్లాసుల నీళ్ళు పెట్టుకుని రెండు చెంచాలు టీ పొడి వేసి డికాషన్ మరగనివ్వాలి. తర్వాత డికాషన్ వడపోసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఇనుప కడాయి లేదా స్టీల్ పాత్ర తీసుకుని దానిలో హెన్నా పౌడర్ వేసుకోవాలి. దీనిలో డికాషన్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి బాగా కలుపుకోవాలి. డికాషన్ సరిపోకపోతే కొంచెం వేడి నీళ్ళు కూడా వేసుకొని ప్యాక్ లాగా అప్లై చేసుకోవడానికి వీలు ఉండే విధంగా కలుపుకోవాలి.
దీనిపై మూతపెట్టి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయం లేచిన వెంటనే దీన్ని తల మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన వెంటనే సెకండ్ స్టెప్ కోసం కావాల్సింది తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని మీ హెయిర్ కు సరిపడినంత ఇండిగో పౌడర్ ను వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చిటికెడు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ ఇండిగో పౌడర్ ను కూడా గోరువెచ్చటి నీళ్లతో హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి.
హెన్నా అప్లై చేసిన దాని మీద ఇండిగో పేస్ట్ ను కూడా అప్లై చేసి 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు ఆరనివ్వాలి. తర్వాత నార్మల్ వాటర్ తో తల స్నానం చేయాలి. షాంపూ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన తెల్ల వెంట్రుకల మొత్తం నల్లగా మారతాయి. ఈ హెయిర్ కలర్ వారం లేదా పది రోజులు మాత్రమే ఉంటుంది. వారానికి ఒకసారి వేసుకుంటూ ఉండాలి. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఉపయోగించుకోవచ్చు. ఈ రెమిడి నాచురల్ది కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మంచి ఫలితం ఉంటుంది.