Can You Use Rice Water for Hair Growth

ఊడిపోయిన జుట్టు తిరిగి విపరీతంగా పెరగాలంటే ఇది రాయండి

రాలిపోయిన జుట్టును తిరిగి పెరగడానికి జుట్టు బలంగా, ఒత్తుగా ఉండటానికి ఒక మంచి హెయిర్ మిస్ట్ మరియు హెయిర్ ఆయిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టుపై మనం తీసుకునే శ్రద్ధ జుట్టు పెరుగుదలకు, జుట్టు నష్టాన్ని దారితీసే కారణాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు బియ్యం, మెంతులు, నారింజ లేదా కమలా తొక్కలు. ఒక గిన్నెలో లేదా గాజు గ్లాస్ లో బియ్యాన్ని తీసుకోవాలి. ఎన్ని బియ్యాన్ని తీసుకుంటామో అన్ని స్పూన్ల మెంతులు కూడా తీసుకోవాలి. ఐదారు స్పూన్ల బియ్యం వేసుకొని అంతే మొత్తంలో మెంతులు కూడా వేయాలి. తర్వాత గ్లాసు మునిగేంత వరకు నీటిని పోసుకోవాలి తర్వాత నారింజ లేదా కమలా తొక్కలను ఈ నీటిలో వేసుకోవాలి.

ఒక రాత్రంతా ఈ నీటిలో బియ్యం, మెంతులను నానబెట్టి వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి ఒక స్పూన్ అలోవెరా జెల్ కలపాలి. వీటన్నింటినీ బాగా కలిపి ఒక స్ప్రేయింగ్ బాటిల్లో తీసుకోవాలి. జుట్టును పాయలుగా తీసుకుంటూ స్కాల్ఫ్ కి ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి తర్వాత నెమ్మదిగా మసాజ్ చేసి 40 లేదా 50 నిమిషాలు తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇందులో వాడిన మెంతులు, అలోవెరా జెల్ జుట్టును స్మూత్ గా మెరుస్తూ ఉండేలా చేయడంలో సహాయపడతాయి. నారింజ తొక్కలులోని విటమిన్ సి తలలోని చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. బియ్యం నీటిలోని ప్రోటీన్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

 తలలోని చర్మానికి మంచి పోషకాలు అంది జుట్టు మృదువుగా, బలంగా పెరుగుతుంది. హెయిర్ ఆయిల్ కోసం హోంమేడ్ ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి. అందుబాటులో లేకపోతే ఏదైనా బ్రాండెడ్ ఆల్మండ్ ఆయిల్ తీసుకోవచ్చు. ఈ ఆల్మండ్ ఆయిల్లో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలుపుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్ ఈ  ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా, పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది. విటమిన్ ఈ క్యాప్సిల్స్ మరింత పోషణను అందించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. వారంలో ఒక్కసారైనా ఇలా నూనెను అప్లై చేసి కనీసం రెండు గంటలు లేదా రాత్రంతా ఉంచుకొని తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!