Cardamom Uses in telugu

తీపి వంటకాలకే కాదు, ఆరోగ్యానికి వహ్వా అనిపించే ప్రయోజనాలు చేకూరుస్తుంది ఇది!!

వంటింట్లో మసాలా దినుసు, చూడడానికి రంగు రూపం ఎలా ఉన్నా మంచి సువాసన కలిగి వంటలకి మన ఆరోగ్యానికి అందానికి ఎంతో వన్నె తెచ్చేవి యాలకులు. యాలకులు వేయని స్వీట్ అసలు చాలావరకు లేనే లేదు, అని చెబితే అతిశయోక్తి కాదెమో. వంటింటి మహారాణి అని మన ఈ యాలకులను నిస్సందేహంగా అనవచ్చు. యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలు చూడండి మరి.

◆యాలకులు జీర్ణ శక్తిని మెరుగు పరచుటమే కాదు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలను కూడా అదుపులో ఉంచుతాయి. ఇంకా డిప్రెషన్ లో ఉన్నవారు రోజు యాలకులు వేసిన టీ గానీ పాలు కానీ  తీసుకుంటె డిప్రెషన్ కి చెక్ పెట్టొచ్చు అనే విషయం తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

◆ వీటిలో ఇంకా ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయి. పొటాషియం  అధికంగా ఉండడం వల్ల గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి గుండెను ఆరోగ్యంగా ఉండేలా పరిరక్షిస్తుంది.. మెగ్నీషియం క్యాల్షియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. యాలకుల్లో ఉండే పీచు పదార్థం వల్ల జీర్ణ వ్యవస్థ అదుపులో ఉంటుంది.

◆రక్తహీనత ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలల్లో అర స్పూన్ యాలకుల పొడి కొద్దిగా చక్కెర వేసుకుని తాగుతూ ఉంటే రక్తహీనతను నివారించ గలుగుతారు. ఒక గ్లాస్ నీటిలో యాలకుల పై పొట్టు  తీసి వేసి గింజలను మాత్రం నీటిలో నానబెట్టి పొద్దున్నే ఆ నీటిని తాగేసి ఆ గింజలు నమిలి తినేస్తే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల ఫలితం  స్పష్టంగా కనిపిస్తుంది

◆ఇంకా ఏమైనా దెబ్బలు అనుకోకుండా తగిలిన గాయాలకు కాలిన మచ్చలకు పుండ్లకు కూడా యాలకులు బాగా పనిచేస్తాయి. యాలకులను మెత్తగా పేస్టులా నూరి దెబ్బ తగిలిన చోట పైపూతగా పట్టిస్తే గాయం త్వరగా తగ్గుతుంది మంచి ఉపశమనం ఉంటుంది.

◆ఇవే కాకుండా సంతాన సాఫల్యత పెంచడంలో  కూడా యాలకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వాటిలో ఉండే సనియోల్ అనే కాంపౌండ్ పురుషుల్లో ఉండే నరాల బలహీనత దూరం చేసి  నరాలను మరింత పటిష్ట పరుస్తుంది. 

◆బీపీని అదుపులో ఉంచేందుకు కూడా యాలకులు బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు ఆరోగ్య రక్షకాలు గాపనిచేస్తాయి. 

చివరిగా….

 రోజుకి రెండు యాలకులు నమిలి తినడం వల్ల దంతాలు చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన దూరమవుతుంది. యాలుకులు నుంచి వచ్చే మంచి సువాసన వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఎన్నో సమస్యలకి యాలకలు మంచి మందు అని ఆయుర్వేద వైద్యులు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే సూచించారు.

Leave a Comment

error: Content is protected !!