మనం ప్రతిరోజు ఎన్నో రకాల కాయగూరలు తింటూ ఉంటాము. మనం తీసుకునే కూరగాయలలో ఎన్నో విటమిన్లు మన శరీరానికి లభిస్తున్నందువల్లే మనం ఆరోగ్యంగా ఉండగల్గుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే వాటిలో తియ్యటి కాయగూర క్యారెట్‌ను మించింది మరొకటి లేదు అంటే కచ్చితంగా నమ్మాల్సిందే.
◆క్యారెట్లో ఎన్నో రకాల విటమిన్లతోపాటు మన ఆయుషుని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు విరివిగా వున్నాయి. విటమిన్లు, ఖనిజాలు రెండు సమానంగా గల కూరగాయ క్యారెట్. క్యారెట్ లో మనశరీరానికి ముఖ్యంగా కావలసిన పన్నెండు రకాల ఖనిజ లవణాలని ఇందులో చూడవచ్చు. విటమిన్ బి, సి, జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం సోడియం అన్ని ఉన్నాయి.
◆ వీటివల్ల ప్రయోజనాలు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ. , రోజూ ఒక ఆపిల్ తినడం కంటే ఒక క్యారెట్ తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.
◆క్యారెట్ లోని బీటాకెరోటిన్ వల్ల స్త్రీ పురుషులకు ఇద్దరికీ సరైన ప్రయోజనాలు అందిస్తుంది. క్యారెట్స్ ను మెత్తగా గ్రైండ్ చేసి, జ్యూస్ తయారుచేసుకొని వారానికి ఒకటి రెండుసార్లు తీసుకోవచ్చు.దానివల్ల వీర్యకణాల సామర్థ్యం మెరుగుపరుస్తుంది సంతానం కోసం ఎదురు చూసేవారు ప్రయత్నించి చూడవచ్చు.
◆ జీర్ణక్రియను మెరుగుపరచడంలో క్యారెట్ ఉత్తమంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ భోజనం తర్వాత ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కంటిచూపును మెరుగుపరుస్తుంది. కళ్ళు కాంతివంతంగా ఉంటాయి.
◆క్యారెట్ రక్తాన్ని శుద్ధి పరచడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండె వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఎప్పుడైనా గుండెల్లో మంటగా అనిపిస్తే క్యారెట్‌ను మెత్తగా ఉడికించి చల్లార్చి అందులో స్పూన్ తేనే వేసుకుని కలిపి తింటే గుండెల్లో మంట మటుమాయం.
◆ వీటిని పచ్చిగా అలాగే తినడం వల్ల నోటి అల్సర్ల నివారణ సాధ్యమవుతుంది. వయస్సు పెరిగే కొద్దీ, ఆడవారిలో ఎక్కువగా కీళ్ళనొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్య లేకుండా ఉండాలి అంటే రోజు ఓ పచ్చి క్యారెట్ తింటే ఇందులో ఉండే విటమిన్ సి కీళ్లనొప్పులను దూరం చేసేందుకు బాగా సహాయపడుతుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది.
◆క్యారెట్ లోని విటమిన్ ఎ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు, రక్తహీనతను పోగొట్టే గుణం కూడా పుష్కలంగా ఉంది. క్యారెట్ లో అధిక పోషక విలువలుండటం వల్ల ఆరోగ్యానికి అపర సంజీవని అని చెప్పొచ్చు.
◆ఇందులో ఉన్న ఇంకో మంచి గుణం ఏంటి అంటే మధుమేహం ఉన్నవారు పచ్చిక్యారెట్లనీ రోజుకి ఒకటి తినడంవల్ల ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటితో పాటు ఇంకొక విషయం క్యారెట్లు రోజువారీగా తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని దూరం చేస్తుంది. పేగుల్లో అడ్డు పడిన మలినాలను దూరం చేయడానికి క్యారెట్ జ్యూస్‌లోని పీచు బాగా ఉపయోగపడుతుంది……
◆రక్తపోటు ఉన్నవారికి కూడా క్యారెట్ మంచి మందులా పనిచేస్తుంది. చిన్న చిన్న విషయాలకు అతిగా టెన్షన్ పడిపోతూ ఉండేవారు కూడా రోజుకో క్యారెట్ తింటే హైపర్ టెన్షన్ తగ్గుతుంది.
చివరగా……
క్యారెట్ ను చాలా రూపాల్లో తీసుకోవచ్చు. సలాడ్,జ్యూస్. రకరకాల కూరలు రైస్ ఐటమ్స్ పచ్చిగా ఎలా అయినా సరే తరుచుగా తింటూ ఉంటే ఆరోగ్యాన్ని మన సొంతం చేస్తుంది క్యారెట్. దీని కలర్ చూస్తే కళ్ళకి ఇంపు, తింటే కడుపుకి తంపు, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందానికి అందం. అందుకే వదలకండి.