castor seeds oil health benefits

మీకు జీవితంలో పంటినొప్పి,నడుం,కీ ళ్ళనొప్పులు,బట్టతల,జుట్టు ఊడిపోవడం,గజ్జి,తామర,దురద శాశ్వతంగా మాయం

అమ్మ లాగా అనుక్షణం మనల్ని కాపాడే అత్యంత విలువైన చెట్లలో సుప్రసిద్ధమైన ఆముదం చెట్టు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ చెట్టు మన ఊరిలోనే మన కళ్లముందే కనిపిస్తూ పెరుగుతుంది. ఈ ఆముదం చెట్టు గింజల నుండి తీసిన ఆముదం నూనెతో మన భారతీయ ప్రాచీన తరాలు సంపూర్ణ ఆరోగ్యంతో గడిపారని మనం గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే మన శరీరంలోని సర్వాంగాల అంటే మన శరీరంలోని ప్రతి అంగాన్ని వందలాది వ్యాధులనుండి కాపాడుకోవడానికి ఈ ఆముదం ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు. ఆముదాన్ని సంస్కృతంలో ఏరండ, పంచాంగల, వర్ధమాన అని హిందీలో రెండీ, తెలుగులో ఆముదం చెట్టు, ఇంగ్లీషులో కాస్టర్ ఆయిల్ ప్లాంట్ అని పిలుస్తారు.

ఈ ఆముదం చెట్లలో ఎర్ర ఆముదాల చెట్టు తెల్ల ఆముదాల చెట్టు అని రెండు రకాలు ఉంటాయి. తెల్ల ఆముదం చెట్టులో  పెద్ద గింజలు ఉంటాయి. చిన్న గింజలు కాచేది చిట్టి ఆముదం చెట్లు అని ఉంటుంది.

ఆముదం చెట్టు యొక్క ఉపయోగాలు

పక్షవాతంతో కానీ మలబద్దక సమస్యతో బాధపడేవారు ఈ ఆముదం చెట్టు గింజలను ఒక 100 గ్రాములు తీసుకుని పగలగొట్టుకుని పై బెరడు తీసివేయాలి. ఎందుకంటే ఈ పేరు విషపూరితమైనది దీన్ని కచ్చితంగా తీసివేయాలి. లోపల తెల్లగా ఉండే పప్పులు తీసి మెత్తగా నూరి గిన్నెలో వేసి నాలుగు రెట్లు ఆవు పాలు వేసి కోవాలాగా మారే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 100 గ్రాముల చక్కెర వేసి చిన్న మంటపైన మరిపిస్తూ ఈ పదార్థమంతా హల్వా అంటే లేహ్యం లాగా అయ్యేవరకు ఉంచి తర్వాత దించేసుకోవాలి.

ఈ లేహ్యాన్ని మీరు ప్రతిరోజు రెండు పూటలా ఆహారానికి గంట ముందు 5 గ్రాముల నుండి 10 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉంటే అన్ని రకాల వాత రోగాలు, మలబద్ధకం పక్షవాతం హరించుకుపోతాయి. అయితే మీరు ఈ లేహ్యాన్ని తీసుకున్నంత కాలం వాతాన్ని కఫాన్ని కలిగించే పదార్థాలని అస్సలు తీసుకోకూడదు.

స్త్రీల సమస్యల నివారణకు

అలాగే స్త్రీలలో బహిష్టు సంబంధిత సమస్యలకు ఈ ఆముదం ఆకు  కొంచెం నలగగొట్టి వేడి చేసి గోరువెచ్చగా పొత్తి కడుపు పైన పెట్టుకొని ఒక గుడ్డతో కట్టు కట్టుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయాన్ని ఆకులను తీసేస్తూ ఉంటే మీ బహిష్టు సంబంధిత సమస్యలు అన్ని తొలగిపోతాయి.

కీళ్ల నొప్పుల నివారణకు

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతున్నా కీళ్ల నొప్పులు శరీరంలోని వాపులు మంటలు ఇలాంటి సమస్యలకు ఆముదం చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. దీనికోసం మీరు ఈ ఆముదం ఆకులను కొద్దిగా నువ్వుల నూనె పూసి  ఈ ఆకులను వెచ్చ చేసి  వేడివేడిగా కీళ్ల నొప్పులపైన వేసి కట్టు కడుతూ ఉంటె కీళ్ళ వాపులు నొప్పులు క్రమంగా తగ్గుతాయి. అలాగే ఈ ఆముదం పప్పును మెత్తగా నూరి వేడి చేసి గోరువెచ్చగా ఆ ముద్దను కీళ్ల నొప్పుల పైన వేసి కట్టు కడుతూ ఉంటే కూడా మీ కీళ్ల మంటలు తగ్గిపోతాయి.

చర్మ సంబంధిత సమస్యల నివారణకు

చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ ఆముదపు గింజలు పగలగొట్టి పై బెరడును తీసివేసి లోపలి పప్పును పెరుగులో వేసి ఒక రోజంతా నానబెట్టి మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని దురదలు దద్దుర్లు పైన రాస్తూ ఉంటే వారం రోజుల్లో ఎటువంటి చర్మ సంబంధిత సమస్యలు దురదలు కనిపించకుండా పోతాయి. మనకు చర్మం కాలి పుండులగా తయారు అవుతాయి. అలాంటి వారు సున్నపు తేట పై నీరు ఆముదం ఈ రెండింటినీ సమపాళ్ళలో ఒక పాత్రలో పోసి గిలకొట్టి వెన్నెలలాగా మారిన తర్వాత దాన్ని కాలిన పుండ్ల పైన బొబ్బల పైన రాస్తూ ఉంటే అవి త్వరగా మాడిపోతాయి.

రేచీకటి తగ్గడానికి

అలాగే వంటలకు ఉపయోగించే ఆముదం నూనెతో ప్రతి రోజు క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే రెండు మూడు నెలల్లో రేచీకటి కూడా తగ్గిపోతుంది. అలాగే ఈ ఆముదంలో తాలింపు వేసిన చామదుంపల కూర తింటూ ఉంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. కొద్ది మోతాదులో ప్రతిరోజూ రాత్రిపూట ఈ ఆముదం నూనె ను తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోవడం మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.

జుట్టు సమస్యల నివారణకు

బట్టతల సమస్యతో కానీ జుట్టు ఊడిపోవటం ఇలాంటి వెంట్రుకల సమస్యలతో బాధపడేవారు ఈ ఆముద గింజల పై బెరడు  తీసి మెత్తగా నూరి వెంట్రుకలు ఊడిపోయిన ప్రదేశంలో ఉరుద్దుతూ ఉంటె మీ వెంట్రుకలు అనేవి బట్టతలపై ఊడిపోయిన వెంట్రుకలు సైతం తిరిగి వస్తాయి. అలాగే జుట్టు రాలిపోతుంది ఆముదం నూనె మెంతుల పొడి కలిపి వెంట్రుకలకు మాస్క్ లాగా  వేసుకుని ఒక ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేస్తూ ఉంటే మీ వెంట్రుకలు బలంగా పెరుగుతాయి

2 thoughts on “మీకు జీవితంలో పంటినొప్పి,నడుం,కీ ళ్ళనొప్పులు,బట్టతల,జుట్టు ఊడిపోవడం,గజ్జి,తామర,దురద శాశ్వతంగా మాయం”

Leave a Comment

error: Content is protected !!