Causes of Fatigue Dehydration Anemia Eat Healthy Balanced Diet

దీనిని మించిన టాబ్లెట్ మరొకటి లేదు, ఒకటి వేసుకుంటే చాలు నీరసం తగ్గి వెంటనే బలం పెరుగుతుంది

మనిషికి నీరసం రావడానికి ముఖ్య కారణాలు రక్తహీనత డీహైడ్రేషన్ ఎండాకాలంలో  ఎక్కువగా చెమట పట్టడం, సోడియం, పొటాషియం శరీరంలో తగ్గిపోవడం నీరసం వచ్చేస్తుంది. అధిక బరువు ఉన్న వారికి కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా కొంచెం పని చేసే సరికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది.  దీనివల్ల త్వరగా నీరస పడిపోతారు. థైరాయిడ్ తో బాధపడే వారికి కూడా ఎక్కువగా నీరసంగా ఉంటుంది. డిప్రెషన్ లో ఉన్న వారికి కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. 

ఇంకా చాలా విటమిన్ లోపాలు ఉన్నవారు కూడా ఎక్కువ నీరసంగా ఉంటారు. ఐరన్ లోపం ఉన్నవారికి కూడా నీరసం ఉంటుంది. వీటన్నిటికీ కారణం శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం. చూడటానికి  బాగా బొద్దుగా ఉన్న వారిలో కూడా పోషకాల లోపం  ఉంటుంది. అంటే వాళ్ళు బొద్దుగా లావుగా ఉన్నారు కదా వాళ్లలో పోషకాల లోపం ఎందుకు ఉంటుంది అనుకుంటాం. కానీ లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా సరే పోషకాల లోపం ఉంటుంది. 

వాళ్ళు లావుగా ఉండటానికి కారణం వాళ్ళ శరీరంలో కొవ్వు ఉంటుంది. పోషకాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు పోషకాహారం తీసుకోవట్లేదు కాబట్టి.ఆకు కూరలు,వెజిటబుల్స్, పళ్ళు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి అవసరం అయిన పోషకాలు లభిస్తాయి. సరైన డైట్ కూడా తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడం ద్వారా ఎనిమియా తగ్గించుకోవడం ద్వారా విటమిన్స్ లోపం తగ్గించుకోవడం ఐరన్ లోపం తగ్గించుకోవడం థైరాయిడ్  డిప్రెషన్ వంటివి తగ్గడం వలన కూడా నీరసం తగ్గుతుంది.

నీరసం తగ్గడం కోసం సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆకు కూరలు, తోటకూర, బెల్లం, నువ్వులు, పల్లీలు వంటివి తీసుకోవడం వలన ఐరన్ లోపం తగ్గుతుంది. ఇవన్నీ తినడం వల్ల కూడా తగ్గట్లేదు అనుకున్న వాళ్లు వీటితోపాటు మల్టీ విటమిన్ టాబ్లెట్  నీరసం ఉంటే రోజుకు ఒకటి వేసుకోవడం వలన విటమిన్ లోపం తగ్గించుకోవచ్చు. లేదంటే రెండు రోజులకు ఒకసారి వేసుకోవాలి. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 

ఒక నెలరోజులపాటు ఉపయోగిస్తే సరిపోతుంది. ఒక నెల తర్వాత  సమస్య తగ్గినట్లయితే డోసు కూడా తగ్గించుకుంటూ  రెండు రోజులకు ఒకసారి లేదా మూడు రోజులకు ఒకసారి చొప్పున వేసుకుంటే సరిపోతుంది. జీవితాంతం వేసుకోవాల్సిన అవసరం లేదు.

Leave a Comment

error: Content is protected !!