చర్మం ముడతలు పడకుండా ఉండడానికి, స్కిన్ ఎక్కువకాలం యంగ్ గా ఉండడానికి, పింపుల్స్ రాకుండా ఉండడానికి, స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి ఇలాంటి లాభాలు అందిస్తూ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడే అరగాన్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా మూడు యూనివర్సిటీలు నిరూపించడం జరిగింది. ఈ ఆయిల్ ని ఆరగాన్ సీడ్ నుంచి తీస్తారు. దీనిని వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అరగాన్ ఆయిల్లో 26-39% ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనిలో విటమిన్ E అనేది 18.5 మిల్లీ గ్రామ్స్ ఉంది. ఈ రెండిటి వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.
స్కిన్ లోపల ఉండే కొల్లాజెన్ ఎక్కువ తయారు చేస్తుంది. దీని వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. స్క్రచ్ మార్క్స్ రాకుండా కూడా ఈ ఆర్గాన్ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా చర్మం ముడతలు పడకుండా స్క్రచ్ మార్క్స్ రాకుండా ఈ ఆరగాన్ ఆయిల్ ఉపయోగపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ మిర్చిగాన్ USA వారు నిరూపించడం జరిగింది. ఈ ఆర్గాన్ ఆయిల్లో కో ఎంజైమ్ Q10 బాగా ఉంటుంది. ఇది మైటోకాండ్రియాని హెల్తీగా ఉంచడానికి, కణం లోపల యాక్టివేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్కిన్ సెల్ లోపల అందుకని స్కిన్ సెల్స్ త్వరగా రీప్లేస్ అవడానికి హెల్దీగా ఉండడానికి, స్కిన్ బాగా కాంతివంతంగా ఉంటుంది.
కొత్త కణాలు బాగా ఉత్పత్తి అవ్వడానికి కో ఎంజైమ్ Q10 బాగా ఉపయోగపడుతుంది. ఈ అరగాన్ ఆయిల్ ఫేస్ మీద మర్దన చేసి అప్లై చేయడం వల్ల పింపుల్స్ రాకుండా చర్మం అందంగా కనిపిస్తుంది. ఇది స్కిన్ లోపలికి వెళ్లి లోపల ఉన్న యాక్సిస్ ఆయిల్ ని వేస్ట్ ని బయటకు వచ్చేలా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది స్త్రీలు నీళ్లు తక్కువ తాగుతుంటారు. కొంతమందికి వాతావరణ పరిస్థితుల వల్ల స్కిన్ డ్రై అవుతుంది. 40 దాటిన వారికి మెనోపాజ్ లక్షణాలు కనిపించినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ తగ్గడం వల్ల స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది.
ఇలాంటి వారికి ఈ అరగాన్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ డ్రై నెస్ తగ్గి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసినట్టుగా ఉంటుంది. స్కిన్ సెల్స్ లో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఈ ఆయిల్ కాపాడుతుంది. కాబట్టి ఈ అరగాన్ ఆయిల్ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.