Chanakya neeti Suggestions in Telugu

స్త్రీ గురుంచి చాణక్యుడు చెప్పిన విషయాలు

హలో ఫ్రెండ్స్ … స్త్రీ అనే పదం చాలా గొప్పది. ఒక జీవి పుట్టుక కి కారణం స్త్రీ అలాంటి స్త్రీ గురించి పూర్వం ఎంతో మంది రాజులు రాజ్యాలను కోల్పోయారని ఎన్నో యుద్ధాలు జరిగాయని మనకు తెలుసు. స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలరు అని మనకు తెలుసు. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే “సముద్రం లోతైన తెలుసుకోవచ్చు కానీ స్త్రీ మనసులో ఏముందో ఎవరూ తెలుసుకోలేరు.” మరి అలాంటి స్త్రీ గురించి మనకు తెలియని నిజాలు మనం తెలుసుకోవలసిన విషయాలు స్త్రీ గురించి చాణిక్యుడు చెప్పిన ఐదు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.

మనుషులని ఆకర్షించడంలో స్త్రీ దేవుని కన్నా ఎక్కువ మరి అలాంటప్పుడు పురుషుడు స్త్రీ ఆకర్షణలో పడితే ఎలా నిందించగలం. ఈ ప్రపంచంలో ప్రేమను మించిన బలమైన అనుబంధం ఎక్కడా లేదు. అలాంటి స్త్రీ ప్రేమలో పురుషుడు పడితే ఆమె చేతిలో అతను కీలుబొమ్మ అయినవాడే. ఎందుకంటే ప్రేమతో కట్టిపడేసే తాడు చాలా శక్తివంతమైనది. తేనెటీగకు చెక్కను చీల్చుకొనే శక్తి ఉంది. కానీ ఒక్కసారి తామరపువ్వులో  ప్రవేశించాక అది బయటకు రాలేదు. ఎందుకంటే ఆ పువ్వులో ఉండే మధురాని బంధానికి లోనవుతుంది కాబట్టి. పురుషుడు కూడా స్త్రీ అనే వ్యామోహంలో పడితే తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు.

డబ్బు మనకు చాలా అవసరం అది లేకపోతే మనకు ఎక్కడా విలువ లేదు. దానికి చాణిక్యుడు ఇలా అంటున్నాడు డబ్బు దాచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఏ క్షణమైనా పేదరికంలో పడవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే డబ్బు ఉంటే నే స్త్రీని ఆకర్షించగలం కానీ డబ్బు స్త్రీ ఈ రెండు మనల్ని ఎప్పుడైనా మోసం చేయవచ్చు. అందుకే మనం ఈ రెండు విషయాలను ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.

పురుషుడు పెళ్లి చేసుకునే విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే తొందరపడి తీసుకున్న నిర్ణయం వారి  జీవితాలను పాడు చేయవచ్చు. పెళ్లి చేసుకునే అమ్మాయిని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటారు కానీ ఇప్పుడున్న తరంలో ఏడు తరాలు చూడకున్నా కనీసం ఒక తరం అయినా చూడాలి. ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఇలాంటి వారైతే ఆ అమ్మాయి అలానే ఉంటుంది కాబట్టి. పెళ్లి చేసుకున్నాక కూడా అలానే ప్రవర్తిస్తుంది ఎందుకంటే తను పెరిగిన పెంపకం వాతావరం అలాంటిది కాబట్టి. స్త్రీ అందంగా లేకపోయినా వారి ఫ్యామిలీ బాగుంటే పెళ్లి చేసుకోవచ్చు ఆట. అంటే మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటే జీవితం మొత్తం బాధపడాల్సి వస్తుందట.అందం అనేది ఇది శరీరానికి సంబంధించినది కానీ మనసుకు కాదు కదా.

ఒక స్త్రీ పురుషుని కన్నా సుకుమారం గా ఉంటుంది. కానీ స్త్రీకి పురుషుని కన్నా నాలుగు రెట్లు విచ్చలవిడితనం ఉంటుందట ఆమె పురుషుని కన్నా ఆరు రెట్లు ధైర్యవంతురాలట. పురుషుని కన్నా ఎనిమిది రెట్లు కోరిక ఉంటుందట. స్త్రీ తన అందంతో పురుషుని రెచ్చగొడుతుంది తన చూపుతో బందీని చేస్తుంది. అలా పురుషుని కోరిక అనే కారాగారంలో బంధించి చేస్తుందట. స్త్రీ వయసు మీద పడుతుందని ఇప్పుడు ఒప్పుకోదు ఇంకా వీలైనంత అందంగా కనపడటానికి ప్రయత్నిస్తుంది. తను  ఎప్పుడూ అందం మీదే దృష్టి పెడుతుంది అలాంటి స్త్రీ వ్యామోహంలో పడకుండా పురుషుడు జాగ్రత్తగా ఉండాలి.
అన్ని మంచి లక్షణాలు కలిగిన స్త్రీ వ్యామోహంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

అన్నీ మంచి లక్షణాలు కలిగిన స్త్రీ తన భర్తకు ఉదయం తల్లిలాగా పగటి వేళ సోదరి లాగా పగలు రాత్రి అవ్వగానే భార్య లాగ మారి తనని సంతోష పడుతుందట. అలాంటి స్త్రీ తన భర్తకు అవసరాలను తెలుసుకుని నమ్మకంగా ఉంటుంది. కానీ  స్త్రీ తన భర్తకు చేసే సేవల వల్ల చేసిన పాపాలన్నీ పోతాయట. నేపాల్ లో ఒక సాంప్రదాయం ఉంది అదేమిటంటే స్త్రీ ప్రతి రోజు తన భర్త పాదాలకు కంచు పాత్రతో కడిగి ఆ కడిగిన నీటిని తాగుతుందట దానివల్ల ఆమె వయసు పెరిగి సంతోషంగా సంపదతో కలిగి ఉంటుందని వారి నమ్మకం.

తన భర్తకు కట్టుబడి ఉండే స్త్రీ దొరకడం పురుషుని అదృష్టమని అలాంటి స్త్రీ దొరకడం పురుషుని అదృష్టమట. స్త్రీ చేసిన పాపాలు పోవాలంటే తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం దానం చేసిన అనేక రకాల ఉపవాసాలు ఉన్నా మౌన వ్రతాలు ఉన్న దేవాలయాల చుట్టూ తిరిగిన ఆమె మనసు స్వచ్ఛంగా అవ్వదట. ఎంత ఆకర్షణీయంగా ఒక అందమైన ఆకారాన్ని పొందిఉన్నా ఆమె కేవలం ఒక మానవ మనిషి మాత్రమే కానీ పురుషుడు తన యవ్వనమంతా ప్రేమ పైత్యంతో పిచ్చివాడు నిరంతరం బాధపడుతూ దుఃఖం అనేది ఒక పెనుతుఫానులో మునిగి పోతున్నాడు.

ఒక కుర్రవాడు ఇలా అంటున్నాడు “ఓ ముసలి వాడ దీని కోసం వెతుకుతున్నాను ఏదైనా పోగొట్టుకున్నావా?” దానికి జవాబుగా ముసలివాడు ఇలా అన్నాడు “ఓ తెలివి తక్కువ కుర్రవాడా  నేను పోగొట్టుకున్న నా యవ్వనం గురించి వెతుకుతున్నాను అని జవాబిచ్చాడు”. యవ్వనం అనేది పోతే రానేరాదు కదా. స్వర్గంలో ఉండే దేవుడే కాంతదాసుడు అయినప్పుడు ఒక మామూలు మానవుడు అవ్వటానికి ఎవరిని నిందించగలం.

స్త్రీ వ్యామోహంలో పడకుండా ఉండాలంటే స్వచ్ఛమైన మనసుతో దేవుడిని పూజించాలి. స్వర్గలోక సుఖాలు అనుభవించాలంటే తను కచ్చితంగా నైతిక విలువలకు దూరంగా ఉండాలి. శాస్త్రాలు చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి అప్పుడే మనం స్త్రీ వ్యామోహంలో పడకుండా ఉండగలం. అందుకే కనీసం ముఖ బిందువుని చూడటానికి ఇష్టపడరు సాధువులు. చాణిక్యుడు చెప్పిన ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకున్నారుగా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పేజీ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.

1 thought on “స్త్రీ గురుంచి చాణక్యుడు చెప్పిన విషయాలు”

Leave a Comment

error: Content is protected !!