Chanchala Aaku Best Benefits

ఒక్కసారి తింటే చాలు. 120 ఏళ్ళవరకూ చూపు తగ్గనివ్వదు

పొలాల్లో ఇంటి పక్కల ఎక్కువగా కనిపించే ఈ మొక్కను ఆకుకూరగా తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ కనిపించడం వలన కలుపు మొక్కగా తీసి పడేస్తూ ఉంటాం. ఈ మొక్క పేరు చంచల కూర దీనిని తెలుగులో చెంచల చెట్టు, చెంచల ఆకు వంటి పేర్లతో పిలుస్తారు. సంస్కృతంలో అరణ్య, అరణ్య వస్తుక అని అంటారు. ఈ మొక్క అమరాంథేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం డిగేరా మూరికాటా. పల్లెటూర్లలో ఈ ఆకును ఆకు కూరగా వండుకొని తింటారు. చిన్నపిల్లలు ఈ చెట్టు నుండి పుష్పాలను సేకరించి  వాటి నుండి తీపి పదార్థం కోసం నోట్లో పెట్టుకుని పీల్చేవారు.

 ఈ మొక్కలు కెన్యా, ఉగాండా, మలేషియా, సౌదీ అరేబియా, మడగాస్కర్, సోమాలియా మరియు మన దేశంలో ఎక్కువగా పండుతుంది. ఈ మొక్కను పూర్వం నుండి మన సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా వాడతారు. ఈ మొక్క యొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, రుతుక్రమం ఆగిన లక్షణాలు, క్రానిక్ ఫెటీగ్ మరియు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేయడానికి హెర్బల్ మెడిసిన్గా ఉపయోగించబడుతుంది.  చెంచలాకు ఒక వార్షిక మూలిక, ఇది 20-70 సెం.మీ పొడవు వరకు పెరుగుతుంది.

ఆకులు మరియు లేత రెమ్మలు వండి కుండ మూలికగా వాడతారు. ఈ మొక్క తరచుగా స్థానికంగా కూరగాయగా ఉపయోగించబడుతుంది మరియు కెన్యాలోని తీరప్రాంత తెగలలో వండిన కూరగాయగా ప్రసిద్ధి చెందింది. కొన్నిసార్లు ఇది కరువు ఆహారంగా పరిగణించబడుతుంది మరియు మరేమీ అందుబాటులో లేనప్పుడు కెన్యా, ఉగాండా దేశాలలో ఆహారంగా ఉపయోగించబడుతుంది. ఈ మొక్క చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. పొలం పనులు చేసే వారు ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో వేడి చేస్తుంది.

 అలాంటప్పుడు ఈ ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకు కషాయం తీసుకోవడంవలన కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. ఈ ఆకుల పేస్టును గాయాలపై రాస్తే గాయాలను త్వరగా నయం చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గించి మూత్రం సాఫీగా విడుదలయ్యేలా చేస్తుంది. ఈ చెట్టు వేర్ల కషాయాన్ని తాగడం వలన బాలింతలలో పాల వృద్ధికి సహాయపడుతుంది.

ఈ ఆకుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులో విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది కంటి సమస్యలను తగ్గించి కంటిచూపు మెరుగయ్యేలా చేస్తుంది. కంటి సమస్యలు ఉన్న చిన్న పిల్లలకు ఈ ఆకుకూరను పెట్టడం వలన కంటి సమస్యలు తగ్గుతాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు ఆకుకూరలను తినడం వల్ల వ్యాధి అదుపులో ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మొక్కను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుబాటులో ఉన్న వారు తప్పకుండా ఈ ఆకులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు .

Leave a Comment

error: Content is protected !!