ఆకుకూరలు అనేవి కూరగాయలతో పోలిస్తే 3 అంతాలు ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఖర్చుతో పోలిస్తే కూరగాయల కంటే ఆకుకూరలు తక్కువ ఖర్చు ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువ లావణాలు, పోషకాలు, ఎక్కువ రకాల మైక్రో న్యూట్రియన్స్, మరియు నాచురల్ సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిరోజు వారి ఇంటిలో ఆకుకూరను ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి అనేక రకాల ఆకుకూరల్లో పొన్నగంటి కూర ఒకటి. ఇది కూడా మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్నాయి.
ఈ కూరను 100 గ్రాములు తీసుకుంటే అందులో నీటి శాతం 77 గ్రాములు ఉంటుంది. శక్తి 73 క్యాలరీలో ఉంటుంది. ఆకు కూరలు ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆకుకూర పొన్నగంటి కూర. అన్నింటికంటే ఎక్కువ ఇందులో కాల్షియం 510mg ఉంటుంది. ఇది ఆల్కలీన్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది ఎముకల పష్టీకి, నిర్మాణానికి చాలా మంచిది. అన్ని రకాల ఆకుకూరలతో తో పోలిస్తే పొన్నగంటి కూరలోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం క్యాల్షియం లోపం ఉన్నవారు ఈ కూరను వండుకోవచ్చు.
ఇంకో స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే అధిక బరువు ఉన్నవాళ్లు కోవ్వు కణాలు డామేజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఇలా కొవ్వు కణాలు డామేజ్ కాకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ ఆకు కూర బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొవ్వు రక్తనాళాల గోడలలో పేరుకుపోకుండా ఉపయోగపడుతుంది. అలాగే పొన్నగంటికూర ఉడకబెట్టినప్పుడు వచ్చే నీటిని పరేయకుండా కషాయంలా చేసుకుని తాగితే మంచిది. ఇది జీర్ణకోశ సంబంధ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. కనుక వీటిని ఉపయోగించగలిగితే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.