chick-peas hidden health benefits

పచ్చి బఠాణీలలో ఇన్ని పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా??

పలావ్ లు, మసాలా కర్రీలు, చాట్ లు, సమోసాలు వీటిలో మనకు దర్శనమిచ్చే పచ్చపచ్చాని గింజలు బఠాణీలు. బఠాణీలు కలిపి వండే ప్రతి వంటకం రుచి మరింత పెరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇలా వాడుతున్న బఠాణిలో గొప్ప పోషకాలు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయ్. అవేమి తెలియకుండా సాధారణంగా వాడేస్తాం మనము ఒకసారి అందులో ఉన్న పోషకాలు బఠాని చేసే మేలు చూద్దామా……

◆ఫ్లేవనాయిడ్స్, కేరోటినాయిడ్స్, విటమిన్-సి, విటమిన్-ఎ మరియు ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు వంటి పోషకాలు కలిగిన బఠాణిలో ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. 

◆బఠాణీలలో క్యాలరీలు, ఫ్యాట్ లు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగనివ్వదు, కాబట్టి డైటింగ్ చేసే వారు బఠాణీలను తీసుకోవచ్చు. 

◆ఫైబర్ అధికశాతం కలిగి ఉంటుంది కాబట్టి జీర్ణాశయాన్ని ఆరోగ్యగం గా ఉంచుతుంది మరియు మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

◆బఠాణీలు తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ను సమతా స్థాయిలో  ఉంచుతుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో చెక్కెరలను రక్తంలో కలవనివ్వకుండా అడ్డుకుని రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు పచ్చి బఠాణీను నిరభ్యరంతంగా తీసుకోవచ్చు.

◆పచ్చి బఠాణీలలో ఆరోగ్యాన్ని సంరక్షించే పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి కడుపులో ఉత్పన్నమయ్యే అల్సర్ పుండ్లను సులువుగా తగ్గిస్తాయి. కాబట్టి కారం ఎక్కువ తినేవారు బఠాణీని తరచుగా తీసుకోవడం వల్ల అల్సర్ వంటి సమస్యలు రావు. 

◆పచ్చి బఠాణీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, కేరోయినాయిడ్స్, ఫోలిఫిలినాయిల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్నవారు బఠాణీని ఆహారంలో  భాగం చేసుకోవాలి.

◆పచ్చి బఠాణీలలో యాంటీ  ఇన్ప్లమెటరీ లక్షణాలు విటమిన్ బి కాంప్లెక్సులు ఉంటాయి.  ఇవి రక్తకణాలను ఉత్పత్తి చేయడంలో మరియు రక్త కణాల ఆరోగ్యానికి  దోహదపడతాయి.  దీనివల్ల గుండె ఆరోగ్య పదిలంగా ఉంటుంది. 

◆ఎముక ఆరోగ్యానికి దోహదం చేసే కాల్షియం తరువాత గొప్పగా తోడ్పడే విటమిన్ బి, మరియు విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల బఠాణీ తీసుకునేవారిలో ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ.

◆మంచి కొవ్వులను ప్రోత్సహించి చెడు కొవ్వులను నివారించడంలో బఠాణీ గొప్పగా పనిచేస్తుంది.

◆బఠాణీ లో ఉండే యాంటీ ఏజింగ్ మరియు  యాంటీ ఆక్సిడెంట్లు  వృద్ధాప్యాన్ని  తీసుకొచ్చే కణాలను ఆలస్యంగా ఉండేలా చేస్తాయి దీనివల్ల వృద్ధాప్యపు ఛాయలు తొందరగా దరిచేరవు.

◆ఇందులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభించడం వల్ల గర్భం దాల్చిన వారికి బాగా దోహదం చేస్తుంది. కడుపులో పెరిగే బిడ్డకు ఎలాంటి పోషకాహార లోపం లేకుండా కాపాడుతుంది

◆బఠాణీలలో ఉండే విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్లు వాపులు మరియు నొప్పులు తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది. 

◆కీళ్లనొప్పులు ఉన్నవారు పచ్చి బఠాని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మతిమరుపు నివారణకు బఠాణీ ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు.

చివరగా…..

పచ్చి బఠాణీలు అందరికి అందుబాటు దరల్లోనే దొరుకుతాయి కాబట్టి బఠాణీలు రోజు ఆహారం లో భాగం చేసుకోడం వల్ల బోలెడు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. 

Leave a Comment

error: Content is protected !!