chinta puvvu health benefits

ఈ పువ్వు ఒక్కటి తింటే చాలు. లివర్ శుభ్రంగా అయిపోతుంది

చింతచెట్టులో కాయలు, ఆకులు, పువ్వులు అన్ని మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. చింతచెట్టు ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు. ఈరోజు మనం చింత పువ్వు కూడా ఒక అద్భుత ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. ఈ చింత పూల గురించి ఇప్పటి వారికి తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. 

చింతచెట్టు ఫెబీసీ  కుటుంబానికి చెందినది. శాస్త్రీయనామం ట్రెమండస్ ఇండికా అంటారు. పూర్వకాలంలో పెద్దలు పిల్లలకు డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు కాదు. దాంతో పిల్లలు ప్రకృతి సహజంగా దొరికే పండ్లు, కాయలు ఎక్కువగా తినేవారు. అందులో ఒకటే చింతకాయలు, చింతపువ్వు. 

చింత పువ్వుతో పండు వేపకాయల గుజ్జును కలిపి చింతగుజ్జుగా తినేవారు. ఈ పువ్వు రుచి వగరుగా, పులుపుగా బాగుంటుంది. పూర్వకాలం ఇలా తెలియకుండానే చింత పువ్వు తినడం వలన దానిలోనూ ఔషధ లక్షణాలు పొందేవారు. చింత పువ్వు వారి ఎదుగుదలకు ఉపయోగపడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 ఈ కాలంలో పిల్లలు ఈ చింతపువ్వులో ఉప్పు కలిపి దంచి ఇష్టంగా తినేవారు. విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ, జింక్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పువ్వుతో పప్పు, పచ్చడి చేసుకొని ఇష్టంగా తింటుంటారు. గ్లాస్ నీటిలో చింత పువ్వు వేసి అరగ్లాసు నీరు అయ్యేంతవరకు మరిగించాలి. తర్వాతి నీటిని వడగట్టి తాగాలి. ఇలా తాగడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి.

చింత పువ్వుతో పచ్చడి చేసుకొని తినడం వలన వాత, కఫ, పిత్త దోషాలు తొలగిపోతాయి. దీనివల్ల రక్త విరోచనాలు తగ్గడం, లివర్ శుభ్ర పడటం, కఫ, వాత, పిత్త దోషాలు అన్ని తొలగిపోతాయి. కామెర్ల వ్యాధి నయమవుతుంది. ఇది శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేసి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. సంవత్సరానికి ఒక్కసారైనా చింత పువ్వు తినడం వలన రక్తం శుభ్రపడుతుంది.

 రక్తం శుద్ధి అవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చింత పువ్వు తరుచు తినటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు మొత్తం పోయి జీర్ణశక్తి  పెరుగుతుంది. జీర్ణశయంలో వ్యాధులు నయమవుతాయి.  పొట్టలో నులిపురుగులు ఉంటే చనిపోతాయి కాబట్టి ఈ కాలంలో పిల్లలకు అన్నంలో కలిపి తినిపించడం వల్ల వారికి పొట్టలో నులిపురుగులు ఉంటే చనిపోతాయి.

  అంతే కాదు శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. మూత్రం సమయంలో మంట తగ్గుతుంది. అంతేకాదు దీనిలోని విలువైన పోషకాలు మన శరీరంలో రక్తప్రసరణను మెరుగు పడతాయి. అన్ని అవయవాలు సక్రమంగా అందేలా చేస్తుంది అందువల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇది అనారోగ్యాలు రాకుండా చాలా మేలు చేస్తుంది. 

డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంచుతుంది. దీంట్లో ఉన్న విటమిన్ సి చర్మాన్ని కూడా కాంతివంతంగా చేస్తుంది. కేవలం కూరలకి ఉపయోగించే చింత పువ్వులు ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నాం కదా. చింతపువ్వు అందుబాటులో ఉంటే తప్పకుండా తరచూ తినండి.

1 thought on “ఈ పువ్వు ఒక్కటి తింటే చాలు. లివర్ శుభ్రంగా అయిపోతుంది”

Leave a Comment

error: Content is protected !!