food to reduce blood cholesterol

ఈ 6 ఆహారపదార్ధాలు తింటే మీ ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం పూర్తిగా క్లీన్ అయిపోతుంది

నేటిరోజుల్లో మనం తినే ఆధునిక ఆహారం మన శరీరంలో మనకి తెలియకుండానే చెడుకొలస్ట్రాల్తో నింపేస్తుంది. ఈ చెడు కొలస్ట్రాల్ రక్తనాళాల్లో చేరి రక్తసరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. ఈ సమస్యల వలన చిన్న వయసులోనే గుండె జబ్బుల బారినపడుతున్నారు. అంతేకాకుండా పొగత్రాగటం, డయాబెటిస్, సరైన వ్యాయామం లేనివారికి ఈ కొలెస్ట్రాల్ వలన  గుండెసంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువ. ఈ చెడుకొవ్వు, అధికబరువు ముప్పు తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఉండే కొన్ని  ఔషధ గుణాలున్న పదార్థాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. అవేంటో చూసేద్దాం.

 పసుపు:- పసుపు అనేక రోగాలను నివారించడంలో యాంటీబయోటిక్గా పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే.  పసుపులో పాలీఫినాల్ పుష్కలంగా ఉంటుంది.  వేడినీటిలో పసుపువేసి కొంచెం చల్లారాక తేనె కలిపి తాగడం వలన  పసుపులోని న్యూట్రీషన్లు రక్తంలో కొవ్వు పెరగకుండా చేసి రక్తనాళాల్లో బ్లాక్స్ని తొలగిస్తాయి.

బాదం :- బాదంపప్పులో ఉండే ఫాలీ అనుశాచ్యురేటెడ్ ఫాట్స్, ఫైబర్ శరీరంలో Hdl,Ldl  లెవల్స్ బాలన్స్ చేస్తాయి. రోజూరాత్రి బాదం నానబెట్టి పరగడుపున తినడంవలన శరీరంలోని కొవ్వు కరిగిపోయి, కొత్తగా చేరకుండా  చేస్తుందని నిపుణుల అభిప్రాయం.

ఆరెంజ్ జ్యూస్ :- ఆరెంజ్ జ్యూస్లో కొవ్వును కరిగించే ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. అందులో ఉండే విటమిన్ సి చెడుకొవ్వును  కరిగించి రక్తాని శుద్ధి చేస్తుంది. రోజూ ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది.

వెల్లుల్లి :- వెల్లుల్లి ఆరోగ్యానికి ఔషధంలాంటిది. ఇది కొవ్వును కరిగించి రక్తం మందంగా కాకుండా చేస్తుంది. రక్తనాళాల్లో గడ్డలు లేకుండా తొలగించి ఎలాంటి గుండె సమస్యలు రాకుండా ఎదుర్కొంటుంది. రోజూ నాలుగు వెల్లుల్లి రెబ్బలను ఉదయాన్నే నమిలితినడం వలన అద్బుతమైన ఫలితాలను చూడొచ్చు.

అవిశెగింజలు :– గుండె ఆరోగ్యానికి అవిశెగింజలు చాలా మంచివి. గుండెకు రక్తం సరఫరాచేసే నాళాలను శుభ్రపరచడంలో చాలా బాగా పనిచేస్తాయి. పైగా ఇందులో ఉండే ఫైబర్, ఒమేగా త్రీ ఫాటీయాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్  పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఒక చెంచా అవిశెగింజలు భోజనం తర్వాత తీసుకోవడం వలన బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

అల్లం :- అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ  మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి సహజంగా రక్తాన్ని శుద్ధిచేసే లక్షణాలు కలిగి ఉండి కొలెస్ట్రాల్ తొలగించడంలో తోడ్పడుతుంది. రోజూ అల్లంటీ తాగడంవలన శరీరంలోని కొవ్వును చాలా త్వరగా తగ్గించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!