రక్తంలో అధిక కొవ్వు అనేక రకాల ఆరోగ్య సమస్యల కు కారణమవుతుందని అందరికీ తెలిసిందే. గుండెపోటు, కీళ్ళనొప్పులు, నడుము, వెన్ను నొప్పులకు గురవుతుంటే కొలెస్ట్రాల్ కారణం కావచ్చు. ప్రపంచంలో జరుగుతున్న మరణాలకు పది ముఖ్య కారణాలలో అధిక కొవ్వు కూడా ఒక కారణంగా ఉంది . మరి ఆ కొలెస్ట్రాల్ గురించి తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ ఒక రకమైన లిపిడ్. ఇది మీ లివర్ సహజంగా ఉత్పత్తి చేసే మైనం లాంటి పదార్థం. కణాలపొరలు, కొన్ని హార్మోన్లు మరియు విటమిన్ డి ఏర్పడటానికి ఇది చాలా ముఖ్యమైనది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
కొవ్వు నీటిలో కరగదు, కాబట్టి ఇది మీ రక్తం ద్వారా నేరుగా ప్రయాణించదు. కొవ్వును రవాణా చేయడంలో సహాయపడటానికి మీ లివర్ లిపోప్రొటీన్‌లను ఉత్పత్తి చేస్తుంది.కొవ్వు మరియు ప్రోటీన్ నుండి తయారైనవే లిపోప్రొటీన్ కణాలు.
అవి మీ రక్తప్రసరణ ద్వారా కొవ్వును మరియు ట్రైగ్లిజరైడ్స్ను తీసుకువెళతాయి. లిపోప్రొటీన్ యొక్క రెండు ప్రధాన రూపాల LDL మరియు HDL.
మీ రక్తంలో ఎక్కువ అధికసాంద్రత కలిగిన కొవ్వు ఉంటే దీనిని అధిక కొవ్వు అంటారు. చికిత్స చేయకుండా వదిలేస్తే, అధిక కొవ్వు పెరిగిపోతే గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. భారతదేశంలోనే ప్రతి సంవత్సరం పన్నెండు లక్షలకు పైగా జనాభా గుండెజబ్బులుతో మరణిస్తున్నారు.
అందులో ముఖ్యంగా పంతొమ్మది నుంచి డెబ్బై సంవత్సరాల వారు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా నాన్వెజ్,వేయించిన పదార్థాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. మసాలాలు, డాల్డా, ఆల్కహాల్ , మైదా, నెయ్యి, గుడ్లు, సిగరెట్, కేకులు, స్వీట్లు కొవ్వులు పెరగడానికి సహాయపడుతుంది. ఇలా పెరిగిన కొవ్వు రక్తనాళాల్లో పేరుకుని కొరొనరీ ఆర్టరీస్లో పేరుకుపోతుంది. దీనివలన బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ సాధారణంగా ఎటువంటి లక్షణాలను కలిగించదు. అందుకే మీ కొవ్వు స్థాయిలను క్రమంతప్పకుండా తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ వయస్సుకి కొలెస్ట్రాల్ ఎంత ఉండొచ్చో తెలుసుకోవడం అవసరం