chubby cheeks home remedies

ఇలాచేస్తే 15 రోజుల్లో బక్కగా,పీక్కుపోయి ఉన్న మీ బుగ్గలు లావుగా,గుండ్రంగా మారుతాయి..chubby cheeks tip

హలో ఫ్రెండ్స్ … మన బుగ్గలు గుండ్రంగా అందంగా పెరగటానికి కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. మనం అందంగా కనిపించాలంటే మన ముఖం అందంగా ఆకర్షణీయంగా ఉండాలి. మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి మన బుగ్గలు. కొంతమంది మహిళలకు శరీరం అందమైన ఆకృతిలో ఉన్న ముఖం మాత్రం నీరసంగా బుగ్గలు లోపలికి పోయి కళ్ళు గుంతలు పడి ఉంటాయి. మరికొందరికి కొంత మానసిక ఒత్తిడి కలిగినా ముఖం నీరసపడి పోయి బుగ్గలు లోపలికి వెళ్లిపోతాయి. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని హోం రెమడీస్ ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని రకాల ఎక్ససైజ్ చేయడం వలన మన బుగ్గలు అందంగా తయారవుతాయి. అలాంటి వాటిలో డీప్ బ్రీత్ ఎక్ససైజ్ చాలా ముఖ్యమైనది. బుగ్గలు బాగా రావటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ డీప్ బ్రీథింగ్ ఎక్సర్సైజులు ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

బుగ్గల నిండా గాలిని నింపి అలాగే లైట్ గా ఆ గాలిని 30 నుంచి 60 సెకండ్లు అలాగే ఉంచుకోవాలి. తర్వాత నెమ్మదిగా ఆ గాలిని వదిలేయాలి. ఇలా రోజుకు రెండు మూడుసార్లు చేస్తే మీ బుగ్గలు సహజసిద్ధంగా యవ్వనంగా మెరుస్తూ ఉంటాయి. హోమ్ రెమిడీ గా రెండు స్పూన్ల రోజ్ వాటర్ లో ఒక స్పూను గ్లిజరిన్ కలిపి మీ బుగ్గలకు మృదువుగా రాసి బాగా మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన మీ చర్మం టైట్ గా అవడంతో పాటు మీ బుగ్గలు ముడతలు లేకుండా గుండ్రంగా పెరగడానికి సహాయ పడతాయి. గ్లిసరిన్ రోజ్ వాటర్ మన చర్మ సౌందర్యానికి చాలా మంచిది. కావున ఈ మిశ్రమం మన బుగ్గలకు సహజసిద్ధమైన పోషణను ఇవ్వడంతోపాటు తాజాదనాన్ని అందాన్ని కూడా ఇస్తుంది.

అలాగే మీరు తీసుకునే ఆహార పదార్థాలలో కూడా మీ బుగ్గలు గుండ్రంగా అందంగా తయారవుతాయి. దానికోసం మీరు శరీరానికి కావలసిన కేలరీలను ప్రోటీన్లను విటమిన్లను మీ శరీరానికి అందిచాలి. దీనికోసం మీరు ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు తాగండి ఒక గ్లాస్ పాలు ఉదయం ఒక గ్లాసు రాత్రి తాగండి. ఇలా మూడు నెలలు క్రమం తప్పకుండా తాగితే అందమైన మీ సొంతమవుతాయి. ఇంతకు ముందు చెప్పిన ఎక్సర్సైజెస్ తో పాటు ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు అందమైన మృదువైన బుగ్గలు మీ సొంతం అవుతాయి.

ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.

Leave a Comment

error: Content is protected !!