cleans your lungs in 20 days homeremedy drink

రోజు ఇది ఒక గ్లాస్ తాగితే 20 రోజుల్లో ఊపిరితిత్తులు శుభ్రపడతాయి

ప్రస్తుతం ఉన్న కాలుష్యపు సమాజంలో మనకు  ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు లేకపోయినా, పరోక్ష ప్రభావం, వాహనాల కాలుష్యం వల్ల ఊపిరితిత్తులకు సంబందించిన సమస్యలు వేధిస్తుంటాయి. ఊరితిత్తులు కలుషితం అయిపోవడం వల్ల మన శరీరంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వీటన్నిటికి కేవలం ఒకే ఒక్క గొప్ప డ్రింక్ తో చెక్ పెట్టవచ్చు.  కేవలం ఈ డ్రింక్ ను 20 రోజుల పాటు విడవకుండా తాగడం వల్ల కలుషితమైపోయిన ఊపిరితిత్తులను శుభ్రపరుచుకోవచ్చు. అయితే ఆ డ్రింక్ కు కావల్సిన పదార్థాలు ఏంటి?? ఎలా తయారు చేసుకోవాలి చూడండి మరి.

 కావలసిన పదార్థాలు: 

●ఒక గ్లాస్  నీళ్లు

●పుదీనా ఆకులు రెండు లేక మూడు

●అంగుళం అల్లం లేక అరటీస్పూన్ అల్లం పౌడర్

●ఒకటి లేదా రెండు యాలక్కాయలు

●మిరియాలు రెండు లేదా మూడు

●నిమ్మకాయ అరచెక్క

●తేనె ఒక టేబుల్ స్పూన్

తయారు విధానం: 

ముందుగా గ్లాసుడు నీళ్లలో ఒక ఆగిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి కాగనివ్వాలి.   నీళ్లు మర్లుతున్నపుడు అందులో పుధీన ఆకులు, అల్లం పౌడర్ లేక అంగుళం అల్లాన్ని బాగా దంచి నీళ్లలో వేయాలి,  అదే విధంగా యాలక్కాయలు,  మిరియాలు కూడా దంచి వేయాలి.  రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా మరిగించిన తరువాత దించి చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నపుడు అందులో అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి.  

దీన్ని భోజనం చేయడానికి లేదా ఏదైనా ఆహారం తీసుకోవడానికి 10 నుండి 20 నిమిషాల ముందు తాగాలి. 

ఇతర జాగ్రత్తలు

●ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి

●తాజా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.  ముఖ్యంగా నూనె పదార్థాలు ఎక్కువగా తినకూడదు.

●శీతల పానీయాలు, శ్వాశసంబంధ సమస్యలను కలిగించే అతి చల్లని పదార్థాలకు దూరం గా ఉండాలి. 

●మసాలాలు, కారం, వేపుళ్ళు, ఆవకాయ లాంటి వాటిని ఆహారంలో తీసుకోవడం తగ్గించాలి

●తాజా పళ్ళు, పళ్ళ రసాలు, ఆకు కూరలు, సమతుల్యమైన ఆహారాన్ని భాగం చేసుకోవాలి.

●డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తప్పనిసరిగా జోడించుకోవాలి.

◆ముఖ్యంగా ఆహారపు అలవాట్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలి

చివరగా….

పై చెప్పుకున్న  జాగ్రత్తలు పాటిస్తూ, ఈ పానీయం తీసుకుంటే ఊపిరి తిత్తులు శుభ్రపడటమే కాకుండా  రక్తాన్ని శుద్ధి చేసి, రక్తప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

1 thought on “రోజు ఇది ఒక గ్లాస్ తాగితే 20 రోజుల్లో ఊపిరితిత్తులు శుభ్రపడతాయి”

Leave a Comment

error: Content is protected !!