coconut water health benefits

పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తాగగలిగే అద్భుతమైన పానీయమిది!!

కల్తీ లేనీ చేయడానికి కుదరని ఒక  పానీయం ఏమిటో తెలుసా?? సర్వరోగ నివారణం అయిన ఒక అద్భుతమైన పానీయం ఇది, పసిపిల్లల నుంచి బాగా పెద్దవాళ్ళ వరకు ఎవరుతాగినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్  లేని  దివ్యౌషధం. అదే కొబ్బరి నీరు.

◆మన రక్తంలో ఎలక్ట్రోలైట్ సమతౌల్యం ఏవిధంగా ఉంటుందో కొబ్బరి నీటి లోనూ అదే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆరోగ్యం బాగొక డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ తో పాటు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండమంటారు. అంటే కొబ్బరి నీరు కూడా ఒక ఔషధం తో సమానం అన్నమాట. లేత కొబ్బరి నీటిలో చక్కెరలు ప్రధానంగా ఉంటాయి. కొబ్బరి బాగా ముదిరిన తరువాత నీటిలో చక్కెర శాతం పడిపోతూ ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు కొంచెం ముదిరిన కొబ్బరి నీటిని తాగడం మంచిది. కానీ లేత కొబ్బరి నీటిలో చక్కెర శాతం ఎక్కువ ఉండి తాగగానే శక్తిని కలుగ జేస్తాయి ఈ నీటిలో ఎన్నో ఖనిజాలూ లభిస్తాయి. రుగ్మతల్ని తొలగించే శక్తి కలిగి ఉంటుంది. 

◆తాజా  కొబ్బరి నీటిలో అనేక సూక్ష్మ పోషకాల, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావం కలిగి ఉంటుంది. లేత కొబ్బరి నీటిలో అత్యధికంగా లభించే పొటాషియం, తగిన స్థాయిలో సోడియం ఆల్కలైన్ సమతుల్యతను క్రమబద్ధీకరించి రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది

◆ఈ నీటిలోని కాల్షియం ఎముకల్ని, పళ్ళను దృఢంగా ఉంచి, కండరాల బలోపేతానికి గుండె సమస్యలు రాకుండా సహకరిస్తుంది. అలసటకు గురై శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కొబ్బరి నీరు మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. ఇంకా డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది.

◆ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వేసవిలో మనకు లభించే కొబ్బరినీటిని తాగితే. మెగ్నిషియం క్యాల్షియం పొటాషియం సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి.

◆గర్భవతులకు మలబద్దకం, జీర్ణకోశంలో తేడాలు. గుండెలో మంట ఉంటాయి. వీటిని కొబ్బరి నీరు తాగడం ద్వారా అధిగమించవచ్చు. గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు పాపాయిల ఆరోగ్యానికీ కొబ్బరి నీరు ఎంతగానో సహకరిస్తుంది. బిడ్డకు పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీటిని తాగితే అనేక పోషకాలు అందుతాయి, తల్లి పాలలో లారిక్ యాసిడ్ ను పెంచుతుంది.

◆దీనిలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ. వైరల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల్ని అనేక ఇన్ ఫెక్షన్ల నుంచి కొబ్బరి నీరు సమర్థవంతంగా కాపాడుతుంది.

◆గుండె జబ్బులకి అధిక రక్తపోటు ప్రధానకారణం. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి.

ఈ రెండు ఖనిజాలు గల కొబ్బరి నీరు రక్తపోటును నివారించి, రక్తసరఫరాను మెరుగు చేయడంలో సహకరిస్తుంది.

◆కొబ్బరి నీరు మూత్ర, వ్యవస్థలపై థెరపటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మూత్రకోశ ఇన్ ఫెక్షన్లు, మూత్రపిండంలో రాళ్లను తగ్గించడంలో,శృంగార శక్తిని పెంచడంలో కొబ్బరి నీరు ఎంతగానో సహకరిస్తుంది. 

◆కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడానికి కొబ్బరి నీటిని తాగడంవల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

బరువు కోల్పోతున్నామని అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగాలి. తక్కువ కొవ్వు కలిగినందున కొబ్బరి నీళ్లను వీలైనన్ని ఎక్కువ సార్లు తాగడం ఉత్తమం. పోషకాలు, విటమిన్లు ఉన్నందున కొబ్బరి నీళ్లు తాగితే  రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. 

◆వైరస్లు, బాక్టీరియాల బారిన పడ కుండా జాగ్రత్త పడొచ్చు. రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లనీ ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు తోలగిపోతాయి. మంచి నిగారింపు వస్తుంది. 

చివరగా……

కొబ్బరినీరు మన ఆరోగ్యానికి లభించిన ఒక వరం. అసలే వేసవి కాలం. కొబ్బరి నీరే మనకి  ఉపశమనం ఇప్పుడు. కాబట్టి మన ఆరోగ్యం కోసం

కొబ్బరి నీరు తాగేద్దాం ఆనందంగా ఉందాము.

Leave a Comment

error: Content is protected !!