హలో ఫ్రెండ్స్ .. ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరం వంటివి సర్వ సాధారణంగా ఎవరికైనా వస్తాయి. జలుబు దగ్గు ఉన్నప్పుడు చికాగ్గా ఉండటమే కాదు గొంతులో నొప్పి వలన మింగడానికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ అనారోగ్యాలను తగ్గించుకునేందుకు చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇలా మెడిసిన్స్ ఇష్టమొచ్చినట్లు వాడితే పిల్లలకు పెద్దలకు ఎప్పటికైనా ముప్పు తప్పదు. అలాంటి బాధలకు గురి కాకుండా మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో ఈ రోజు చెప్పబోయే విధంగా కషాయాన్ని తయారు చేసుకుని వాడితే ఒక్కరోజులోనే మీకు మంచి రిలీఫ్ వస్తుంది.

ఈ చిట్కాకు కావలసిన పదార్థాలు
- తులసి ఆకులు 10
- మిరియాలు 10
- అల్లం 1 ఇంచ్
- పటిక బెల్లం ఒకటిన్నర స్పూను.
తయారు చేసుకునే విధానం
- ముందుగా అల్లాన్ని తొక్క తీసి రోటిలో వేసి మెత్తగా దంచండి.
- తర్వాత ఇందులో మిరియాలు వేసి మెత్తగా దంచండి.
- తర్వాత అందులో తులసి ఆకులు వేసి మూడింటిని మెత్తగా నూరుకోవాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని పోసి స్టవ్ మీద పెట్టి మరిగించండి.
- అరగ్లాసు నీరు అయ్యేంతవరకూ దీనిని బాగా మరిగించండి. తర్వాత ఇందులో పటిక బెల్లాన్ని వేయండి. తరువాత ఈ కషాయాన్ని ఒక పాత్రలోకి వడ పోసుకోండి.
ఎలా వాడాలి ?
- కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక టీ గ్లాసు మోతాదులో దీనిని తాగాలి.
- ఇది తాగిన తర్వాత ఒక గంట వరకు ఏమీ తీసుకోకూడదు.
- ఈ కషాయం తాగడం వల్ల జలుబు గొంతు నొప్పి తలనొప్పి జలుబు వల్ల వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్లు పోతాయి.