Constipation Relief Exercises Get Free Motion

మలబద్ధకమా? ఉదయాన్నే లేచి ఇలా చేయండి…

పైల్స్ ఇబ్బంది చాలామందిని బాధపడుతూ ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఆపరేషన్ అయితే కాదు ఆపరేషన్ చేయించిన మళ్లీ ఆ ఇబ్బంది అలానే ఉంటుంది. వీరు మోషన్ కి వెళ్లేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఇబ్బంది పడేవారు డైట్ వల్ల కొంత పరిష్కారం ఉన్న యోగాసనాలు వేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు మోషన్ ఫ్రీగా వెళ్లాలి అంటే ఆహార నియమాలతో పాటు కొన్ని రకాల యోగాసనాలు అభ్యాసన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇలా ఆసనాలు వేసినప్పుడు ప్రేగులలో కదలికలు పెరిగి ప్రేగులకు ఉండే కండరాలు బలంగా అవ్వడానికి ఉపయోగపడుతుంది.

                   అలాంటి ఆసనాలు రెండు రకాలు విపరీత కరణి మరియు బద్ధకోనాసన్. మొదటిది విపరీత కరణి మనం వెళ్లకల పడుకున్న తర్వాత రెండు చేతుల్ని కలిపి సీటు దిగువ  భాగాన పెట్టుకోవాలి. రెండు కాళ్ళను కలిపి మోకాలు బెండ్ చేయకుండా పైకి లిఫ్ట్ చేసి పట్టుకోవాలి. తరువాత చేతులను నడుము దిగువ భాగాన్ని సపోర్టుగా పెట్టి ఒకటి రెండు నిమిషాలు అలానే పట్టుకుని ఉండాలి. తరువాత కొంచెం విశ్రాంతి తీసుకుని తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకొకసారి చేసుకోవచ్చు. ఈ విపరీత కరణి చేసినప్పుడు పేగుల్లో వచ్చే ప్రభావం ఆ ప్రేగులలో వచ్చే ఇరిటేషన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇక రెండవది బద్దకోనాసన్ ముందుగా రెండు కాళ్ళను చాపాలి.

                  చేతులను పైకి లేపి రెండు కాళ్ళను రెండు చేతులతో పట్టుకొని రెండు పాదాలనే తొడ భాగాల దగ్గరికి తీసుకువెళ్లాలి. పాదాలు రెండు ఆనేటట్టు నమస్కార ముద్రలో పాదాలు పెట్టిన తర్వాత హిప్ జాయింట్ దగ్గర మజిల్స్ అన్ని బాగా స్టిచ్ అవుతాయి. ఒరిజినల్ గా బద్దకోనాసన్ స్థితి అది. ఇంకా కొంతమందికి రెండు చేతులని నేల మీద పెట్టేసి, చేతుల్ని చాపేసి గడ్డం భాగం నేలకు ఆనేలా ముందుకు వంగుతారు. ఇలా ఆసనాలు వేయడం ద్వారా ఫ్రీ మోషన్ జరిగి హెల్దీగా యాక్టివ్ గా ఉంటారు. ఈ విధంగా చేస్తే మలబద్ధకం ఏమీ ఉండదు. ఈ చిట్కా ఫాలో అయితే పైల్స్ రాకుండా నిరోధించవచ్చు. వచ్చిన వాళ్ళకి తగ్గేలా చూడవచ్చు.

                    ఈ ఆసనాలు వేయడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇలా నేచురల్ నైట్ తీసుకుని ఈ అవాసనాలు చెప్పిన విధంగా చేస్తే మలబద్ధకాన్ని రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!